ప‌వ‌న్ వార్నింగ్‌తో రంగంలోకి మంత్రి

`జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ హెచ్చ‌రిస్తేనే.ప్ర‌భుత్వంలో క‌ద‌లిక వ‌స్తుంది` అన్న రీతిలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మారిపోతున్నాయి.

 Ganta Srinivasa Rao Responds Pawan Kalyan Demands-TeluguStop.com

మొన్న రాజ‌ధాని రైతుల భూములు స‌మ‌స్య.నిన్న‌ ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌.

నేడు సింహ‌పురి విద్యార్థుల స‌మ‌స్య‌.ఇలా స‌మ‌స్య ఏద‌యినా ప‌వ‌న్ స్పందిస్తున్నాడు.

అనంత‌రం ప్ర‌భుత్వంలో చ‌ల‌నం వ‌స్తోంది.నెల్లూరులోని సింహ‌పురి వ‌ర్సిటీ విద్యార్థుల స‌మ‌స్యలు ప‌రిష్క‌రించే దిశ‌గా.

మంత్రి గంటా శ్రీనివాస‌రావు రంగంలోకి దిగారు.వ‌ర్సిటీ అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటుచేసి.

విద్యార్థులు, వ‌ర్సిటీలోని స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు.

త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే.

ప‌వ‌ర్ స్టార్‌ని క‌లిస్తే చాలు.దానికి ప‌రిష్కారం దొరుకుతుంది అన్న రీతిలో ఏపీ ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నారు.

ప్రభుత్వానికి మొర పెట్టుకోవడం కంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్ల‌డం న‌యం అన్న భావ‌న ప్ర‌జల్లో వినిపిస్తోంది.ప్ర‌భుత్వం కూడా పవ‌న్ స్పందించిన వెంట‌నే.

ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతుండ‌టం విశేషం!! ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలోని సింహ‌పురి వ‌ర్సిటీ విద్యార్థులు ప‌వ‌న్‌ను అలా క‌లిశారో లేదో.వెంట‌నే సంబంధిత శాఖా మంత్రి.

యూనివ‌ర్సిటీ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటూ కొందరు విద్యార్థుల బృందం పవన్ కల్యాణ్‌ని కలిసిన సంగతి తెలిసిందే.

కాలినడకన నెల్లూరు నుంచి బయలుదేరి…విజయవాడ వరకు రాగానే కొందరు అస్వస్తతకు గురయ్యారు.విష‌యం తెలుసుకున్న చలించిన పవన్… వారందర్నీ హైదరాబాద్ రావాల్సిందిగా ఆహ్వానించి స‌మ‌స్య‌ల‌ను విన్నారు.

దీనిపై పవన్ స్పందిస్తూ.విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నెల్లూరు నుంచి పాదయాత్రగా వచ్చే పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు.

ఆ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు నెల్లూరు వర్సిటీ సమస్యలపై దృష్టిసారించాలని పవన్ కల్యాణ్ కోరారు.

వెంట‌నే నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ చాన్స‌ల‌ర్‌తో మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా సమావేశమయ్యారు.సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అక్రమ నియామకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పవన్ కల్యాణ్ దృష్టిసారించే పరిస్థితి ఎందుకు తీసుకువచ్చారని ఆగ్రహించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మ‌రి ప‌వ‌న్ ఎఫెక్ట్ మంత్రిపై బాగానే ప‌నిచేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube