న‌యీం కేసు క్లోజ్... రీజ‌న్ ఇదే

తెలుగు రాష్ట్రంలో చెల‌రేగిపోయి.దందా న‌డిపిన గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీంను కొన్నాళ్ల కింద‌ట పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు.

 Gangster Nayeem Case Closed-TeluguStop.com

అప్ప‌ట్లో ఈ వార్త పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.ఆ త‌ర్వాత కూడా రెండు మూడు నెల‌ల పాటు న‌యీం వార్త‌లు ఫ‌స్ట్ పేజీలలోనే కొన‌సాగాయి.

అయితే, ఇప్పుడు ఆయ‌న‌కు స‌బంధించిన కేసుల‌ను కూడా పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేశారా? ప‌్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లో.ఆయా కేసుల‌ను పూర్తిగా నీరు గార్చారా? న‌యీంతో ఎవ్వ‌రూ అంట‌కాగ‌లేద‌ని, న‌యీంకి అస్స‌లు రాజ‌కీయ నేత‌ల‌తో సంబంధం లేద‌ని నిరూపించే ప‌నిలో ప్ర‌భుత్వం, పోలీసులు మునిగిపోయారా? అంటే తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే చెప్పాల్సి వ‌స్తోంది.

నిజానికి… ఒక‌ప్పుడు న‌యీంతో అంట‌కాడి దందాలు న‌డిపిన వారు, న‌యీం బెదిరింపుల‌కు జీ హుజూర్ అన్న‌వారు.న‌యీంతో క‌లిసి ఆస్తులు పంచుకున్న‌వారు పెద్ద వాళ్లు కావ‌డంతో అంద‌రి దృష్టీ న‌యీం కేసుపై ప‌డింది.

ముఖ్యంగా న‌యీంకి సంబంధించి ల‌భించిన ఓ డైరీలో మాజీ మంత్రులు, పోలీస్ మాజీ బాస్‌ల పేర్లు ఉన్నాయ‌ని బయ‌ట‌ప‌డ‌డం అప్ప‌ట్లో బ్రేకింగ్ న్యూస్ అయింది.దీంతో.న‌యీంతో అంట‌కాగారంటూ.టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా చేసిన ఒక‌రిద్ద‌రు స‌హా మాజీ పోలీస్ బాస్‌పైనా క‌థ‌నాలు వ‌చ్చాయి.

అదేవిధంగా కొంద‌రు ఎమ్మెల్యేలు నేరుగా త‌మ‌ను న‌యీం బెదిరించాడ‌ని ప‌బ్లిక్ మీటింగుల్లోనూ చెప్పారు.దీంతో ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటామ‌ని కేసీఆర్ మీడియా సాక్షిగా చెప్పారు.

నిజానికి కేసీఆర్ అన్న‌ట్టుగానే ఈ కేసు ప‌రుగులు పెట్టింది.దీని విచార‌ణ‌పై ఏర్పాటైన సిట్‌.అంద‌రికీ నోటీసులు కూడా పంపింది.అయితే… ఏం జ‌రిగిందో ఏమో.అంతే వేగంగా ఈ కేసు విచార‌ణ మంద‌గ‌మ‌నం ప‌ట్టింది.ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.

దాదాపు తెర‌మ‌రుగైపోయింది.దీంతో ఈ కేసు విచార‌ణను సీబీఐకి అప్ప‌గించాలంటూ.

సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.దీనికి ప్ర‌తిగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా హైకోర్టుకు ఈ కేసు వివ‌రాల‌ను స‌మ‌ర్పించింది.

నయీం వ్యవహారంలో 175 కేసులు నమోదు చేసి 16 ఛార్జిషీట్లు దాఖలు చేశామని హోంశాఖ కోర్టుకు తెలిపింది.

నయీంకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలున్నాయన్న ఆరోపణ నిజం కాదని, ఇతర రాష్ట్రాల నక్సల్స్ – దావూద్ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలు లేవ‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం న‌యీం కేసును పూర్తిగా నీరుకార్చేందుకు పూనుకుంద‌ని తెలిసిపోతోంది.ఇదే విష‌యంలో మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ‌.

కేసీఆర్ ప్ర‌భుత్వం.కేసును నీరుగారుస్తోంద‌ని విమ‌ర్శించారు.

ఈ కేసులో ఎక్కువ మంది టీఆర్ ఎస్ నేత‌లే ఉన్నార‌ని అందుకే దీనిని మూసేసే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని ఆరోపించారు.ఎవ‌రెన్ని ఆరోపించినా.

ప్ర‌భుత్వంలో చిత్త శుద్ధి దారి త‌ప్పింద‌ని మాత్రం స్ప‌ష్టమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube