అభయ్‌రామ్‌పై ఫన్నీ పుకారు

నందమూరి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌రామ్‌.ఈ బుడ్డోడి ఫస్ట్‌లుక్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Funny Rumors On Ntr Son Abhay Ram-TeluguStop.com

అభయ్‌ను చూడగానే ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు.ఇక సినిమా ఇండస్ట్రీలో పుకార్లకు కొదువ ఉండదు.

అప్పుడే ఈ బుడ్డోడిపై పుకార్లు వస్తున్నాయి.అభయ్‌రామ్‌ ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ సినీ వర్గాల్లో ఫన్నీ పుకారు షికారు చేస్తోంది.

ఇక ఆ సినిమాకు టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించనున్నాడట.

మరి కొందరు దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన అక్కినేని అఖిల్‌ ‘సిసింద్రీ’ సినిమాకు సీక్వెల్‌గా నందమూరి అభయ్‌రామ్‌ సినిమా ఉంటుందంటూ ప్రచారం చేస్తున్నారు.

మొత్తానికి సంవత్సరం కూడా నిండకుండానే ఈ నందమూరి బుల్లి హీరో మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తున్నారు.అయితే ఈ ప్రచారం నిజం అయితే బాగుండని నందమూరి ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

అభయ్‌రామ్‌ను అప్పుడే వెండి తెరపై చూడాలని ఫ్యాన్స్‌ ఆశ పడుతున్నారు.మరి ఎన్టీఆర్‌ వారి కోరికను తీర్చుతాడా అనేది చూడాలి.

ఇక ఎన్టీఆర్‌ వచ్చే నెల నుండి సుకుమార్‌ దర్శకత్వంలో ‘ప్రేమతో నాన్నకు’ సినిమాలో నటించనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube