రామ్ చరణ్ మీద తీవ్ర ఒత్తిడి

మినిమo యావరేజ్ సినిమాలతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల స్టామినా ఉన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన గత సినిమా బ్రూస్ లీ తో అట్టర్ ప్లాప్ అయ్యి కూడా నలభై కోట్ల మార్క్ అందుకున్నాడు.ఆ సినిమా ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకొని రామ్ చరణ్ తేజ కొత్త సినిమా మొదలు పెడదాం అనే మీమాంస లో ఉన్నాడు.

 Full Pressure On Ram Charan-TeluguStop.com

కానీ అంతకుమించిన షాక్ లు ఇతర హీరోలు ఇస్తున్నారు.

ఆ షాక్ ఏంటని అనుకుంటున్నారా, అదే ఓవర్సీస్ 1 మిలియన్ మార్క్ కళ.టాప్ స్టార్స్ తో పాటు చిన్న హీరోలు కూడా 1 మిలియన్ మార్క్ అందుకుని రచ్చ చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నాడు.మొన్నటికిమొన్న నాని భలేభలేమగాడివోయ్ తో దాదాపు 1.5 మిలియన్ డాలర్స్ అందుకుని దుమ్ము రేపాడు.

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా 2 మిలియన్ మార్క్ ని గురిపెట్టి టాప్ 3 లో చోటు దక్కించుకున్నాడు.

కాని రామ్ చరణ్ మాత్రం ఇప్పటివరకు $650k ని దాటకపోవడం విషాదం.ఇప్పుడు తమిళ్ బ్లాక్ బస్టర్ తనీఒరువన్ తెలుగులో రీమేక్ చేస్తున్న చెర్రీ ఈ సినిమాతోనైనా ఆ మార్క్ ని దాటాలని టెన్షన్ పడుతున్నాడట.

మరి దాటుతాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube