పొట్ట కొవ్వు తగ్గాలంటే ఈ పండ్లను తినండి

సినిమా హీరోలకి సిక్స్ ప్యాక్ ఉంటే, మామూలు జనాలకి ఫ్యామిలీ ప్యాక్ ఉంటోంది.పాతికేళ్ళ వయసులో కూడా పొట్టని ముందేసుకోని తిరిగే అబ్బాయిలు ఉన్నారు.

 Fruits That Help In Reducing Belly Fat-TeluguStop.com

ఇదంతా లైఫ్ స్టయిల్ సరిగా లేకపోవడంతో తలెత్తే ఇబ్బందులే.పొట్ట తగ్గాలి అంటే జిమ్ లో అయినా, ఇంకెక్కడైనా చెమటోడ్చాల్సిందే.

కాలరీలు కరిగించాల్సిందే.అలాగే ఉడతభక్తి సహాయంలా కొన్ని ఫలాలు మీ పొట్ట దగ్గర కొవ్వుని కరిగించడానికి సహాయపడతాయి.

అవేంటో చూడండి.

* పైనాపిల్ మెటబాలిజంని వేగవంతం చేస్తుంది.

ఇందులో కాలరీలు పెద్దగా ఉండవు.పైగా న్యూట్రింట్స్ ఎక్కువగా లభిస్తాయి.

విటమిన్ సి కూడా బాగా ఉంటుంది.ఈ లక్షణాల వలన ఇది బెల్లి ఫ్యాట్ ని కరిగించేందుకు ఉపయోగపడుతుంది.

* వాటర్ మిలన్ బెల్లి ఫ్యాట్ ని కరిగించటంలో మంచి ఎక్స్పర్ట్.ఇందులో 82% నీరు ఉంటుంది.

దాంతో శరీరంలో అవసరానికి మించి పేరుకుపోయిన సోడియం బయటకు వచ్చేస్తుంది.కాలరీస్ కూడా పెద్దగా ఉండవు.

ఇందులో కూడా విటమిన్ సి ఉండటం అదనపు లాభం.

* బొప్పాయి రెగ్యులర్ గా తింటే మీరే ఈ ఫలం యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటారు.

ఇందులో ఉండే ఎంజైమ్‌లు కొవ్వుని కరిగిస్తూ, మీ జీర్ణశక్తిని పెంచుతాయి.ఇందులో లోఫ్యాట్ కంటెంట్ ఎక్కువే.

* రోజుకి ఒక్కటైనా తినాలి కాని, ఆపిల్ ఓ డాక్టర్ తో సమానం.ఇందులో ఫైబర్ కంటెంట్, న్యూట్రింట్స్ ఎక్కువగా ఉండటంతో జీర్ణశక్తి పెరగటం, మెటాబాలిజం వేగవంతం అవడం జరిగి, మీ కొవ్వు కూడా కరిగిపోతుంది.

* అవోకాడో తిన్నారో లేదో కాని, ఈ ఫలంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో తెలుసుకోనే ఉంటారు.ఫైబర్ కంటెంట్ తోపాటు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ దీంట్లో.

అందుకే పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడేవారు ఈ ఫలాన్ని ఆశ్రయించాలి.

* దోసకాయ రోజు దొరకడం కష్టమేమో కాని, ఇది బెల్లి ఫ్యాట్ కరిగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది.96% వాటర్ కంటెంట్ తో ఇది ఎక్కువ కాలరీలు శరీరంలోకి వెళ్ళకుండా కంట్రోల్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube