రేపటి నుండి 'అమ్మ' పాలన

అమ్మంటే అంతులేని సొమ్మురా….అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా’ అని పాడుకుంటున్నారు తమిళ ప్రజలు ప్రధానంగా అఅన్నాడీఎంకే అభిమానులు, నాయకులు.

 From Tomorrow, Jayalalithaa Set To Return As Chief Minister-TeluguStop.com

రేటి నుంచి రాష్ర్టంలో మళ్లీ అమ్మ జయలలిత పరిపాలన ప్రారంభమవుతోంది.అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన ఆమెను గవర్నర్‌ రోశయ్య ఆహ్వానించారు.

రేపు మద్రాసు విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై జయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.ఆమె ఆరు నెలల్లోగా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావల్సి ఉంటుంది.

అయితే ఆమె ఎన్నికవుతారా, మధ్యంతర ఎన్నికలకు పోతారా అనేది తెలియడంలేదు.వచ్చే ఏడాది కాకుండా ఆ పైఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలి.

అయితే ఇప్పుడు కేసుల నుంచి నిర్దోషిగా బయటపడింది కాబట్టి ప్రజల సానుభూతి ఎక్కువగా ఉంది.ఆమెను మచ్చలేని నాయకురాలిగా చూస్తున్నారు.

ఈ ఊపులోనే ఎన్నికలు పెడితే మళ్లీ సులభంగా అధికారంలోకి రావచ్చని కూడా జయ ఆలోచన చేస్తున్నారట.చూడాలి ఇక ఏం చేస్తారో….!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube