రక్తదానం గురించి తరచుగా వినిపించే ప్రశ్నలు .. వాటి సమాధానాలు

అన్నిటికన్నా అన్నదానం మిన్న అని అంటారు.నిజమే .

 Frequently Asked Blood Donation Questions And Their Answers-TeluguStop.com

అన్నం ఆకలి తీరుస్తుంది.ఏ వ్యక్తీ అయినా సరే, ఓ పూట అన్నం దొరికితే తన కడుపు నిండెంత తింటాడు కాని ఒకేసారి కిలోల కొద్ది అన్నాన్ని అడగదు.

అందుకే అన్నదానం గొప్ప అంటారు.ఎందుకంటే మనిషి తన అవసరానికి మించి అత్యాశపడడు కాబట్టి.మరి రక్తదానం కూడా అంతేగా.అవసరానికి మించిన రక్తాన్ని ఎవరు అడగరు కదా.అదికాక రక్తదానం చేస్తే మనకే మంచిది.కొత్త రక్తం వస్తుంది.

అందులో హేమోగ్లిబిన్ ఎక్కువ ఉంటుంది, టాక్సిన్స్ తక్కువ ఉంటాయి.దాంతో మనం మరింత చురుగ్గా ఉంటాం, అందంగా తయారవుతాం.

అబ్బో ఇంకా బోలెడు లాభాలున్నాయి.కాని రక్తదానం చేయాలంటే చాలామంది సంకోచిస్తారు.

ఎందుకంటే వారి మదిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి.వాటికి సమాధానాలు కావాలి.

అందుకే తరుచుగా అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతున్నాం.

టాటూ ఉన్నవారు రక్తదానం చేయవచ్చా ?

జవాబు : టాటూ వేయించుకున్న కొంతకాలం దాకా చేయకూడదు.స్ట్రిరైల్ పద్ధతిలోనే టాటూ వేయించుకోండి.అప్పుడైతే 10 రోజుల నుంచి ఓ నెల రోజుల తరువాత రక్తదానం చేయవచ్చు.

రక్తదానం చేసే ముందు రక్తపరీక్ష ఎందుకు ?

జవాబు : దాత రక్తం మరో వ్యక్తీకి హాని చేయకూడదు.అందుకే మెడికల్ హిస్టరీ చూస్తారు.

పరీక్షలు కూడా చేస్తారు.

అనేమియా ఉన్నప్పుడు రక్తం ఇవ్వోచ్చా ?

జవాబు : ఇవ్వకూడదు.ఎలాగో డాక్టర్ పరీక్ష చేసేటప్పుడు మీకు అనేమియా ఉంది అని తెలిసిపోతుంది.కాబట్టి వైద్యులే మిమ్మల్ని రక్తం ఇవ్వకుండా అడ్డుకుంటారు.

జ్వరం, జలుబు ఉన్నప్పుడు రక్తదానం చేయొచ్చా ?

జవాబు : అది ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే, ఒంట్లో ఉన్నప్పుడు రక్తం ఇవ్వకూడదు.

ఎన్ని నెలలకి ఓసారి రక్తదానం చేయవచ్చు ?

జవాబు : పూర్తి ఆరోగ్యంగా ఉన్న మనిషి మూడు నెలలకి ఓసారి రక్తాన్ని దానం చేయవచ్చు.

ఏదైనా సమస్యకి మందులు వాడుతున్నప్పుడు రక్తదానం చేయొచ్చా ?

జవాబు : వాడుతున్న మందులని బట్టి ఉంటుంది.డాక్టర్ ని అడగటం బెటర్.

ఉదాహరణకు చెప్పాలంటే ISOTROIN టాబ్లెట్స్ వాడేవారు, అవి వాడటం మానేసిన ఆరు నెలలకు కాని రక్తం దానం చేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube