వాట్సాప్ వాడితే ఈ విషయాల నుంచి జాగ్రత్తగా ఉండండి

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సాప్ వాడుతున్నారు.అందుకే ఇది ప్రపంచంలో అత్యధికంగా వాడబడుతున్న మెసెంజర్ అయ్యింది.

 Fraud Messages In Whatsapp One Should Become Aware Of-TeluguStop.com

ఇది చాలా సులభంగా యూజ్ చేయగలగే యాప్ కావడంతో, టెక్నాలజీ, గాడ్జెట్ ప్రపంచం గురించి అవగాహన లేనివారు కూడా వాడేస్తుంటారు.ఇక అలాంటివారు మెసెజెస్ లో పంపే అజ్ఞానం విడ్డూరంగా ఉంటుంది.

ఈ మెసెజ్ 10 మందికి పంపకపోతే దుర్వార్త వింటారని, పంపితే మంచి జరుగుతుందని, ఏదో లింక్ క్లిక్ చేస్తే లక్ష రూపాయలు గెలుచుకుంటారని, జియో సిమ్ ఫోన్లో వెస్తే మరో సిమ్ వాడలేమని .అబ్బో అదో నస.ఇలాంటివి కొన్ని సిల్లిగా ఉంటాయి, కొన్ని ప్రమాదాలు మోసుకొచ్చేవి ఉంటాయి.ముఖ్యంగా మనకు పరిచయం లేని వ్యక్తులు పంపే సందేశాలు.

* ఎప్పుడూ కూడా తెలియని వ్యక్తులు పంపిన లింక్స్ ఓపెన్ చేయొద్దు.ఇందులో చాలావరకు ఫిషింగ్ లింక్స్ ఉంటాయి.

అంటే హ్యాక్ చేయడానికి వేసే ఎర అన్నమాట.అలాంటి మాల్ వేర్స్ మీ వ్యాట్సాప్ నే కాదు, మొత్తం ఫోన్ మి హ్యాక్ చేస్తాయి.

* వాట్సాప్ ఉచితంగా లభిస్తోంది.ముందు అన్నట్లుగా దీనికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సి రావడం లేదు ఇప్పుడు.

వాట్సాప్ లో ప్రస్తుతానికైతే ట్రాన్సాక్షన్స్ చేసే వెసులుబాటు లేదు.కాబట్టి, ఈ వస్తువుని ఇక్కడే కొనుగోలు చేయండి, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ వాట్సాప్ లోనే చేయవచ్చు అనే మెసెజ్ లను నమ్మి మీ అకౌంట్ డిటేల్స్ ని ఇవ్వొద్దు.

* 10 మందికి ఈ మెసెజ్ షేర్ చేస్తే పుణ్యం వస్తుంది, అకౌంట్లో డబ్బులు పడతాయి, రిఛార్జ్ అయిపోతుంది ….ఇలాంటివి పట్టించుకునేవారినే బక్రా అని అంటారు.

* వాట్సాప్ మీరు సంవత్సరం మొత్తం వాడకపోయినా ఏమి కాదు, ఏదో పని చేయకపోతే మీ ఖాతా డిలీట్ అయిపోతుంది అనే మెసెజ్ చెత్త బుట్టలో వేసే చెత్తతో సమానం.

* ఈ యాప్ ఇంస్టాల్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ చాట్ చెక్ చేయవచ్చు అని వచ్చే సందేశాలు కూడా ఉత్తుత్తవే.

ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగిన వాట్సాప్ మెసెజ్లను థర్డ్ పార్టీ యాప్స్ చదవలేవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube