దేవుడు చెబితే 130 భార్యలతో 203 పిల్లలని కని చనిపోయాడు

ఈ చిత్రంలో కనిపిస్తున్న ముసలాయన పేరు మొహమ్మద్ బెల్లో అబుబకర్.నైజిరియాకు చెందిన ఇతను 93 వయసులో అనారోగ్యంతో ఇటివలే చనిపోయాడు.

 An Islam Preacher With 130 Wives And 203 Children Dies-TeluguStop.com

అయితే అందులో వింతేముంది అని అనుకునేరు.ఇతనో ఇస్లాం మతబోధకుడు.

చనిపోయే ముందు తాను ఒక దైవకార్యం కోసం భూమి మీదకి వచ్చానని, అది పూర్తయ్యింది ఇక వెళ్ళిపోతానని సన్నిహితులతో చెప్పాడట.

ఇంతకి ఇతను చేసిన దైవకార్యం ఏంటి అనుకుంటున్నారు ? 130 భార్యలను పెళ్ళిచేసుకోవడం.వారితో ఏకంగా 203 మంది పిల్లల్ని కనడం.2008 సంవత్సరంలో, ఇతనికి 86 మంది భార్యలు ఉండగా, చాలామంది ఇస్లాం మతపెద్దలు కేవలం నలుగురు భార్యలను ఉంచేసుకోని, మిగితా 82 భార్యలకి విడాకులు ఇవ్వాల్సిందే అని ఇతనితో వాదించారట.దానికి ఈ పెద్దాయన, నన్ను దేవుడు ఒక పని చేసిపెట్టమని ఇక్కడకి పంపాడు, నేను పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆపలేను, నా దైవకార్యం యొక్క పూర్తి వివరాలను అందించలేను అంటూ, అక్కడినుంచి మరో 44 మంది పెళ్ళాడాడు.

ఈ వివాదస్పద మతపెద్ద మృతదేహాన్ని చూడటానికి చాలామందే తరలివచ్చారట.

ఒక మగవాడు పోషించే శక్తి ఉన్నంతవరకు ఎంతమందినైనా పెళ్ళి చేసుకోవచ్చు అని ఈ పెద్దమనిషి బోధిస్తూ ఉండేవాడట.గమ్మత్తుగా ఉంది కదూ ఈయన కథ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube