అందుకే బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేసా అంటున్న శృతిహాసన్

కమల్ హాసన్ గారాలపట్టి శృతిహాసన్ గొప్ప అందగత్తె కావచ్చు.మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కావచ్చు.

 For This Reason Shruti Haasan Broke Up With Her Boyfriends-TeluguStop.com

కాని ఆమె సీనిజీవితం ఈ క్వాలిటిస్ ఉన్నా మొదటినుంచీ సాఫీగా సాగలేదు.శృతి బాగానే కష్టపడింది.

గబ్బర్ సింగ్ తో టాప్ హీరోయన్ గా ఎదిగిన శృతి ఎవడు లాంటి సక్సెస్ తో పాటు శ్రీమంతుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ ని కూడా అందుకుంది.సినిమాల్లో సక్సెస్ అయినా, సినిమాల కంటే బయటి విషయాల ద్వారానే ఎక్కువ వార్తల్లో ఉంటూ వచ్చింది శృతి.

అనగనగా ధీరుడు సమయంలోనే హీరో సిద్ధార్థ్ తో శృతి ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.ఆ తరువాత సిద్ధార్థ్ దారి సమంత వైపు మళ్ళడంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

మళ్ళీ ధనుష్ తో శృతి రిలేషన్ షిప్ అంటూ కొత్త వార్తలొచ్చాయి.చివరకి క్రికేటర్ సురేష్ రైనాతో కూడా శృతికి లింకప్ పెట్టారు.

రైనాతో ఫ్రెండ్ షిప్ నిజమే అని చెబుతారు సినీజనాలు.అయితే రైనా వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.

ఇప్పుడేమో లండన్ లో ఉండే మైకెల్ కార్సలేతో శృతి పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

అయితే తాను బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేసానని.

తనకి కెరీర్ ముఖ్యమని.పని మీద పూర్తిగా మనసు పెట్టేందుకే కొంతమందికి బ్రేకప్ చెప్పానని అంటోంది.

కాని ప్రస్తుతం వార్తల్లో తన స్నేహితుడు లేదా బాయ్ ఫ్రెండ్ మైకెల్ గురించి మాత్రం మాట్లాడలేదు శృతి.మరి శృతి పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరై ఉంటారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube