బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఇవి అస్సలు ముట్టుకోవద్దు

స్లిమ్ గా, ఫిట్ గా ఉండే మనుషులని ఎక్కువగా సినిమాల్లో చూడటమే తప్ప, మనకు మాత్రం బయటి ప్రపంచంలో పెద్దగా కనిపించరు.ఎందుకు అంటే ఏం చెబుతాం … శరీరంపై ధ్యాస ఉండటం వారికి అత్యవసరం .

 Foods To Be Avoided During Weight Loss-TeluguStop.com

మనకేమో ఇష్టానుసారం.ఆసక్తి ఉంటే అన్ని కరెక్టుగా మెయింటేన్ చేస్తాం లేదంటే లేదు.

శరీరం యొక్క బరువు తగ్గించుకోవాలని ఆశపడే వారికి, ఆసక్తి ఉన్నవారి కోసమే ఈ సమాచారం.మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఈ ఆహరం అస్సలు ముట్టుకోవద్దు.

* మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని బరువు తగ్గాలనుకునే వారు పండ్ల రసాలని తాగాకపోతేనే మంచిది.అలాగని పండ్లు తినకూడదని కాదు.

ఎలాంటి సంకోచం లేకుండా పండ్లను తినండి కాని పండ్ల రసాన్ని తాగొద్దు.ఎందుకంటే పండుని జ్యూస్ చేయగానే అందులో షుగర్ కంటెంట్ పెరిగిపోతుంది.

అలాంటప్పుడు మీరు బరువు ఎలా తగ్గుతారు ?

* ఇక షుగర్ కంటెంట్ ఉండే జ్యూసులనే తాగొద్దు అన్నామంటే, ఇక స్వీట్స్ తినవద్దు అని ప్రత్యేకంగా చెప్పాలా ? అలాగే కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళవద్దు.

* ఇది కష్టమైనా విషయమే అయినా, మద్యం అలవాటు మానేయండి.

ఎలాంటి న్యూట్రింట్స్ ఇవ్వకుండా, కాలరీలు ఇవ్వడం ఆల్కహాల్ స్పెషాలిటి.

* ఆలుగడ్డ ఇక్కడ చాలామందికి ఇష్టం అనుకుంటా.

కాని ఆలుగడ్డలో ఫ్యాట్స్ ఎక్కువే.అందుకే దీన్ని పక్కనపెడితే తప్ప, బరువు తగ్గడం కష్టమైన విషయమే.

* సీటీల్లో ఉండే జనాలకి పాప్ కార్న్ తినడం అంటే చాలా ఇష్టం.ఖర్చు ఎక్కువైనా పెద్ద పెద్ద టబ్స్ లాగేస్తుంటారు.

ఇది కూడా మిమ్మల్ని బరువు తగ్గనీయదు.

* ఇక వైట్ బ్రెడ్‌ వలన నష్టం ఏంటో అని తినేయవద్దు.

అది కూడా బరువు తగ్గడానికి అడ్డుగోడగా మారుతుంది.అంతేగాక ఫ్రోజెన్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ జోలికి వెళ్ళకూడదని మన తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube