వక్షోజాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం అవసరం

స్త్రీలలో చాలా ముఖ్యమైన కామోద్రేక కేంద్రంగా వక్షోజాలని చెప్పుకోవచ్చు.అలాగే పురుషుల్లో కామోద్రేకం కలగటానికి ఈ వక్షోజాలు ప్రధాన కారణంగా నిలుస్తాయి.

 Foods That Helps To Maintain Breast Health-TeluguStop.com

మంచి పరిమాణంలో, ధృఢంగా, ఆరోగ్యంగా ఉండే వక్షోజాలపై ఇట్టే మనసు పారేసుకుంటాడు మగవాడు.అందుకే తన వక్షోజాలు మంచి పరిమాణంలో, బిగువుగా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది.

మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?

* ఒమెగా 3 ఫ్యాటి ఆసిడ్స్ వక్షోజాలకి ఎన్నోవిధాలుగా మేలు చేస్తాయి.అందుకోసం వాల్ నట్స్ తినాలి.

వాల్ నట్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటూ, వక్షోజాల పెరుగుదలకు సహాయపడతాయి.

* ఫిష్ ఆయిల్ తో చేసిన వంటకాలు, స్వయంగా చేపలు వక్షోజాలకి బలాన్ని, అందాన్ని తెచ్చిపెడతాయి.

* ప్లమ్ ఫ్రూట్స్ లో ఫాలీఫినాల్స్ బాగా దొరుకుతాయి.ఇవి వక్షోజాలని క్యాన్సర్‌ సెల్స్ బారినుంచి కాపాడతాయి.

వాటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

* బ్రొకోలిలో లభించే సల్ఫర్ఫెన్ వక్షోజాలు పెరగటానికి సహాయపడుతూనే, క్యాన్సర్‌ సెల్స్ తో పోరాడుతూ వక్షోజాలని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

* ఆలీవ్ ఆయిల్ లో యాంటిఆక్సిడెంట్స్ బాగా లభిస్తాయి.క్యాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకోవడానికి యాంటిఆక్సిడెంట్స్ అవసరం ఎంతైనా ఉంది.

* పార్ల్సేలో దొరికే అపిజెనిన్ వక్షోజాల ఆరోగ్యానికి చాలా అవసరమని అధ్యయనాల ద్వారా నిరూపితమైంది.కాబట్టి దీన్ని కూడా డైట్ లో చేర్చుకుంటే మంచిది.

* ఇక కాఫీ కూడా వక్షోజాల ఆరోగ్యానికి మంచిదే అని కొన్ని పరిశోధనలు చెబుతున్నా, ఈ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.కాబట్టి కాఫీ ప్రియులు డాక్టర్ ని సంప్రదించి లాభనష్టాలు అడిగి తెలుసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube