బాడీ బిల్డింగ్ కి ఈ ఆహారం చాలా అవసరం

బాడీ బాగా పెంచాలని, సల్మాన్ ఖాన్ లాగా కనబడాలని ఏ అబ్బాయికి కోరికగా ఉండదు చెప్పండి.కండలు తిరిగిన దేహం పొందాలంటే కేవలం గంటలకొద్దీ జిమ్ లో గడిపితే సరిపోదు.

 Foods That Help In Muscle Building-TeluguStop.com

సరైన ఆహారం కూడా తీసుకోవాలి.వేలకు వేలు పెట్టి ప్రోటిన్ షేక్ కొనాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు మేం చెప్పే ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకుంటే సరిపోతుంది.

* ఏ పనికైనా, శరీరం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం.

ముఖ్యంగా బాడీ బిల్డింగ్ కి.కాబట్టి నీళ్ళు బాగా తాగాలి.

* బాడి బిల్డింగ్ కి ప్రోటీన్లు చాలా అవసరం.శరీరానికి అవసరమైన ప్రోటీన్లు చికెన్ లో దండిగా దొరుకుతాయి.కాబట్టి చికేన్ రోజువారి డైట్ లో ఉండటం కంపల్సరీ.

* కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా .కోడిగుడ్లలో కూడా ప్రొటీన్లు దొరుకుతాయి.పైగా న్యూట్రీంట్స్ శాతం ఎక్కువ.

* ఫిష్ ఆయిల్ అనవసరపు కొవ్వుని కరిగించటమే కాదు, టెస్టోస్టీరోన్ లెవెల్స్ ని పెంచుతుంది.

* రెడ్ మీట్ లో విటమిన్ బి12, ప్రోటీన్లు, ఐరన్ బాగా దొరుకుతాయి.

ఇవి కండరాలు పెరగడానికి ఉపయోగపడుతాయి.

* ఆలీవ్ అయిల్ లో మొనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ.

బాడి బిల్డింగ్ కి ఇది అవసరం.

* ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా కండరాలకి పెంపకానికి అవసరం.

ఇవి సాల్మన్స్ లో బాగా లభిస్తాయి.

* ఇంకా చెప్పాలంటే ఆపిల్, స్పీనచ్, క్యారట్, బ్రొకోలి, టొమాటో, ఓట్ మీల్ లు కూడా బాడి బిల్డింగ్ డైట్ లో ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube