బాలీవుడ్‌కు యువ ఫ్లాప్‌ హీరో

‘జై’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నవదీప్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించాడు.ఈయన నటించిన ‘చందమామ’ చిత్రం తప్ప మరే సినిమా కూడా సక్సెస్‌ను అందుకోలేక పోయింది.

 Flop Hero Navdeep Signs A Bollywood Movie-TeluguStop.com

అయినా కూడా ఈయన తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.తెలుగులోనే కాకుండా ఈయన తమిళం మరియు హిందీల్లో కూడా ఈయన ఆఫర్ల కోసం అన్వేషించాడు.

ఇప్పటికే తమిళంలో రెండు సినిమాల్లో ఆఫర్లు వచ్చిన నవదీప్‌కు తాజాగా హిందీలో ఒక మంచి ఆఫర్‌ వచ్చింది.

బాలీవుడ్‌ ప్రముఖ హీరో అయిన ఇమ్రాన్‌ హస్మీ తాజాగా నటిస్తున్న ‘అజర్‌’ సినిమాలో నవదీప్‌కు స్థానం దక్కింది.

‘అజర్‌’ సినిమాలో నవదీప్‌ ఒక కీకమైన పాత్రను పోషిస్తున్నట్లుగా చెబుతున్నారు.టోనీ డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవదీప్‌ను హిందీ ప్రేక్షకుల ముందుకు సక్సెస్‌తో తీసుకు వెళ్లడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌లను తెచ్చుకోవడంలో విఫలం అయిన నవదీప్‌ బాలీవుడ్‌లో అయినా సక్సెస్‌లతో ముందుకు సాగుతాడా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube