మీకు గర్ల్ ఫ్రెండ్/ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొచ్చే యాప్ ఇది

అన్ లైన్ లో డేటింగ్ యాప్స్ అంటూ బొచ్చెడు యాప్స్ ఉన్నాయి.ట్విట్టర్, ఫేస్ బుక్ లో కూడా అమ్మాయిలు అబ్బాయిలతో, అబ్బాయిలు అమ్మాయిలతో కలిసే ఛాన్స్ ఉంది అనుకోండి … కాని సోషల్ మీడియాలో అయితే పరిచయం బలపడి, డేటింగ్ కి వెళ్ళేదాకా చాలా సమయం పడుతుంది.

 Find A Girlfriend / Boyfriend With The Help Of This App-TeluguStop.com

అందుకే, సూటిగా, సుత్తి లేకుండా మీకు గర్ల్ ఫ్రెండ్ / బాయ్ ఫ్రెండ్ ని ఇచ్చే యాప్ గురించి చెప్తాం వినండి.ఇదేమో కొత్తగా పరిచయం చేయాల్సిన యాప్ కాదు కాని మీలో ఈ యాప్ గురించి తెలిసిన వారి కంటే తెలియని వారే ఎక్కువ కదా.అందుకే ఈరోజు TINDER గురించి చెప్తున్నాం.

TINDER యాప్ డవున్లోడ్ చేసుకొని మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.

అయితే ఫేస్ బుక్ లేదా మొబైల్ నంబర్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తరువాత మీకు ఇష్టం అనిపించే మీ ఫోటోలు ఓ 6 అప్లోడ్ చేయండి.

ఆరు కి ఆరు చేయాల్సిన రూల్ ఏమి లేదు.ఒక్కటి చేసిన సరిపోతుంది.

ఆ తరువాత మీకు నచ్చితే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని కూడా TINDER కి లింక్ చేయండి.లేదంటే వదిలేయండి.

మీ గురించి మీరు రాసుకోండి.అంటే ఎదుటి వ్యక్తీ కేవలం మీ ఫోటోలే కాదుగా, మీ గురించి కొన్ని వివరాలు కూడా చూస్తాడు/చూస్తుంది.

మీ ప్రొఫైల్ సెట్ అప్ పూర్తి అయిన తరువాత ఇక గాలింపు మొదలుపెట్టండి.

మీరు అబ్బాయి అయితే కేవలం అమ్మాయిల ప్రోఫైల్స్ కనిపిస్తాయి.

అదే అమ్మాయి అయితే కేవలం అబ్బాయిల ప్రోఫైల్స్ కనిపిస్తాయి.అదికూడా మీ ఏరియాకి దగ్గరలో ఉన్నవారివి.

అలంటి సెట్టింగ్ మీరే పెట్టుకోవాలి.అలాగే ఏజ్ లిమిట్ కూడా మీరే సెట్ చేసుకోవాలి.

ప్రొఫైల్ లో ఫోటోలు చూడండి, వారి వివారాలు చూడండి .ఒకవేళ ఒక వ్యక్తి ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ బటన్ మీద నొక్కండి.మీరు ఒక వ్యక్తిని లైక్ చేస్తే ఆ వ్యక్తికి నోటిఫికేషన్ వెళుతుంది.ఒకవేళ అవతలి వ్యక్తికి కూడా మీరు నచ్చితే వారు తిరిగి మిమ్మల్ని లైక్ చేస్తారు.

ఇలా ఒక ఆమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు లైక్ చేస్తే మాత్రమే వారు ఇద్దరు చాట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది.ఇంకేం, చాట్ బాక్స్ ఓపెన్ అయ్యాక ఇద్దరు అభిప్రాయాలు, అభిరుచులు పంచుకోండి.

మీ ప్రొఫైల్ లో లేని వివరాలు ముక్కుసూటిగా చెప్పండి.ఎందుకంటే మీరు ఒక రోజు డేట్ కి వెళ్ళినా వెళతారేమో.

అలాంటప్పుడు మీ TINDER లో ఓరకంగా బయట మరోకంగా ఉంటే వారిని మోసం చేసిన వారవుతారు.

ఎలాగో డేట్ కోసమే TINDER లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు.

కాబట్టి మొహమాటం లేకుండా డేట్ గురించి అడిగేయండి.ఇద్దరు ఒకే అనుకున్నాక కలుసుకోండి, మాట్లాడుకోండి.

అంత సవ్యంగా సాగితే మనసులు కలుస్తాయేమో.ఈ యాప్ లో ఉన్న లాభం ఏమిటంటే, అబ్బాయి ఉద్దేశం ఏమిటో అమ్మాయికి ముందే తెలుసు, అమ్మాయి ఉద్దేశం ఏమిటో అబ్బాయికి ముందే తెలుసు.

కాబట్టి మొహమాటాలు, దాగుడుమూతలు ఉండవు.ఏదైనా సూటిగా మాట్లాడటమే.

నోట్ : ఇది ప్రపంచంలో నెం.1 డేటింగ్ యాప్.కాబట్టి పెద్దగా భయపడవద్దు.ఎదుటివ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది.దీనికి TINDER ఎలాంటి బాధ్యత వహించదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube