ఇటీవల ఎక్కువ సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.పలు సినిమాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడి ఆ తర్వాత విడుదల అయ్యాయి.
తాజాగా లారెన్స్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘గంగ’ సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురవుతోందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ రకరకాల కారణాల వల్ల దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది.
ఎట్టకేలకు పూర్తి అయ్యిందని, విడుదలకు సిద్దం అవుతుందనుకున్న సమయంలో ఈ సినిమాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కష్టం అనే వార్తలు వస్తున్నాయి.
తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించాడు.
గత కొంత కాలంగా బెల్లంకొండ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.ఈ సినిమాకు తీసుకున్న ఫైనాన్స్ చెల్లిస్తేనే తప్ప సినిమా విడుదల అవ్వడం కష్టం.
ఈ సినిమపై ఉన్న నమ్మకంతో అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ అయ్యింది.అయితే అంతకు ముందు ఉన్న ఫైనాన్స్ సమస్యలు కూడా ఈ సినిమాపై పడటంతో విడుదల కష్టం అవుతోంది.
ఈనెల 17న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.మరి 17కు వస్తుందా లేదా అన్నది చూడాలి.
ఈ సినిమాలో హీరోయిన్స్‌గా తాప్సి మరియు నిత్యామీనన్‌లు నటించారు.