Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పాపం అ కారణంతోనే కూతుర్ని హీరోయిన్ చేస్తున్న జీవిత - రాజశేఖర్? -Financial Problems Are The Reason Behind Rajasekhar Making His Daughter Heroine?

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కానుంది. ఈ న్యూస్ మీరు ఆల్రెడి వినే ఉంటారు. ఇంత సడెన్ గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటారు అని చాలామంది ఈ వార్త విని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే శివాని రాక ఎవరు ఊహించనిది. రాజశేఖర్ గాని, జీవిత ఎప్పుడూ ఈ టాపిక్ మీద మాట్లాడలేదు, ఆసక్తి కనబర్చలేదు. ఏదైతే ఏం, శివానికి నటిగా ఎదగాలని ఉంది, తల్లిదండ్రులు పంపిస్తున్నారు, సంతోషం. కాని ఈ నిర్ణయం కేవలం శివాని కనబరుస్తున్న ఆసక్తి మీదే తీసుకోలేదని ఫిలింనగర్ లో కబుర్లు చక్కర్లు కొడుతున్నాయి.

రాజశేఖర్ కి ఒకప్పుడు బంపర్ హిట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలతో, వరుస హిట్లతో, ముందువరుస హీరోల్లో ఒకరిగా ఉన్న రాజశేఖర్, ఆ తరువాత ఒక్కసారిగా పడిపోయారు. ఓ పదిహేను సంవత్సరాలుగా రాజశేఖర్ సినిమాలు ఎక్కువ రాలేదు, వచ్చినవి సరిగా ఆడలేదు. కొంత గ్యాప్ తరువాత గరుడవెగ అనే సినిమాతో రాజశేఖర్ మన ముందుకి వస్తున్నారు. ఈ సినిమాకి కూడా రాజశేఖర్ కి దక్కిన పారితోషికం చాలా తక్కువ అంట. కొంతకాలంగా రాజశేఖర్ కుటుంబం అప్పుల్లో నడుస్తున్నట్లు టాక్.

ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడాలంటే, కేవలం తాను ఆడపదడపా సినిమాలు చేస్తే కుదరదని, తనకు సహాయం కావాలని శివానిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి ఇందులో నిజమెంతో.

ఇక శివాని తెలుగులో కాదు, తమిళంలో తన మొదటి సినిమా చేయనుంది. ఈ సినిమా పేరు కుంకి 2.

Continue Reading
More Posts
To Top