సిగరెట్ వలన మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ ప్రమాదం అంట

హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని ఏదైనా రిచ్ ఏరియాలోని ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్ లోకి వెళ్ళి చూస్తే, అబ్బాయిలతో సమానంగానే సిగరెట్లు కాలుస్తారు అమ్మాయిలు.ఆడైనా, మగైనా .

 Female Smokers Are More At Risk Of Brain Bleeding-TeluguStop.com

అలా సిగరేట్ కాల్చడం ఒక స్టైల్ అయిపోయింది నేడు.కాని సిగరేట్ కాల్చడం వల్ల, మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ ప్రమాదం అంట.ఫిన్లాండ్ జరిగిన ఒక రీసెర్చిలో పరిశోధకులు ఈ విషయాన్ని గమనించారు.

సిగరెట్లు అతిగా కాలిస్తే, బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంటుందట.

ఇలాంటి సమస్యను Subarachnoid Hemorrhage అని అంటారు.ఈ ప్రమాదం ఇటు ఆడవాళ్ళకి, అటు మగవాళ్ళకి ఉన్నా, మగవారితో పోల్చుకుంటే, ఆడవారిని మెదడుకే ప్రమాదం ఎక్కువట.

” అవును, Subarachnoid Hemorrhage వచ్చే రిస్క్ ఎక్కువ ఆడవారికే ఉంది.ఈ విషయం మా రిసెర్చిలో తేలింది.1-10, 20-30 ఇలా రోజుకి ఎన్ని సిగరెట్లు తాగే అలవాటు ఉన్నా, మగవారితో పోల్చుకుంటే, బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఫీమేల్స్ కే ఎక్కువ.ఈ సమస్యకు పరిష్కారం సిగరెట్లకి దూరంగా వెళ్ళడమే.

అరోగ్యాన్ని పట్టించుకోవాలి యువత” అంటూ వల్దేమర్ అనే ఫీజిషియన్ చెప్పుకొచ్చారు.

ఈ రిసెర్చిలో 65 వేలకుపైగా స్మోకర్స్ పాల్గొంటే, అందులో సగానికి ఎక్కువ మంది ఆడవారే కావడం విశేషం.

అలాగని ఈ ప్రమాదం కేవలం ఆడవారికే వస్తుందని కాదు.మగవారికి రిస్క్ కొద్దిగా తక్కువ అంతే.

ఆడవారైనా, మగవారైనా .ధూమపానానికి దూరంగా ఉంటేనే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube