బాడి బిల్డింగ్ కోసం డైట్ పాటించి చనిపోయింది .. జిమ్ కి వెళ్ళేవారు జాగ్రత్త

బాడిని పెంచాలని, ఫిట్ గా, బలంగా ఉండాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి.సిక్స్ ట్రెండ్ రావడం, ఆ తరువాత సినిమా హీరోలు కూడా బాడి పెంచడం, అలాగే హీరోయిన్లు కూడా సన్నని నడుముతో కనిపించడంతో జిమ్ కి వెళ్లి కష్టపడాలని ఉత్సాహం నేటి యువతలో బాగా పెరిగిపోయింది.

 Female Body Builder Dies Due To Protein Supplements Intake-TeluguStop.com

మరి బాడి బిల్డింగ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి రెండు.ఒకటి వర్కవుట్, రెండు డైట్.

రెండూ సరిగా ఉంటేనే కొవ్వుని కరిగించవచ్చు అలాగే కండలు పెంచవచ్చు.ఇక డైట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ప్రోటీన్ ఆహారం.

ప్రోటీన్ లేనిదే కండలు పెరగవు.ప్రోటీన్ లేని జిమ్ లైఫ్ ని ఊహించడం కూడా కష్టం.

ఆ ప్రోటీన్ కోసమే చికెన్ ఎక్కువ తింటారు.ప్రోటీన్ షేక్ తాగుతారు, అవసరమైతే ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారు.

ప్రోటీన్ శరీరానికి మంచిదే, కాని ఇక్కడ ప్రోటీన్ ఒకరి ప్రాణాల్ని తీసుకుంది.ఎందుకో, ఎలానో చూడండి.

Female body builder dies due to protein supplements intake - Female Body Builde

ఆస్ట్రేలియాకి చెందిన మీగాన్ ఎఫ్ఫార్డ్ వయసు 25.ఆమె ఒక ప్రొఫెషనల్ బాడి బిల్డర్.ఆశ్చర్యపోకండి, స్త్రీలకు బాడి బిల్డింగ్ పోటీలు ఇండియాలో జరుగుతున్నాయి, ఇక ఆస్ట్రేలియాలో జరగవా.ఒక పోటికోసం ఆమె కండలు మరింతగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది.దాంతో వర్కవుట్లు పెంచి, వాటికి తగ్గట్టుగా డైట్ లో ప్రోటీన్ శాతం మరింతగా పెంచేసి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు, ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ డోసు పెంచేసింది.

పాపం ఆమెకి అప్పటివరకు తెలియని విషయం ఏమిటంటే, ఆమె ఒంట్లో urea cycle disorder (UCD) అనే సమస్య ఉంది.

ఈ కండీషన్ ఉన్నవారి శరీరం ప్రోటీన్ ని సరిగా బ్రేక్ చేయలేదు.అందులోనూ నేచురల్ ప్రోటీన్ కాకుండా, ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఇంకా కష్టం.మరి మీగాన్ ఏమో ఈ విషయం తెలియకుండా చికెన్ తో సరిపెట్టుకోకుండా, త్వరగా బాడి పెంచాలని ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టింది.

ప్రతి 8000 మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటుందట.

దీని వలన రక్తంలో అమ్మోనియా శాతం పెరిగిపోతుంది.దాంతో రక్తం గడ్డకట్టిపోతోంది.

ఇలా మీగాన్ కి మెదడులో జరిగింది.దాంతో ప్రాణాలు వదిలేసింది ఆ అమ్మాయి.

పాపం, అప్పటికి తనకి ఓ కొడుకు, ఓ కూతురు కూడా ఉన్నారు.

ఆమె కేసుని పరిశీలించిన డాక్టర్లు, ఆమె చావుకి కారణం నేచురల్ ప్రోటీన్ కాదు, ప్రోటీన్ పౌడర్, ప్రోటీన్ షేక్ అని చెప్పారు.

ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ ని ఏ బాడి బిల్డర్ అయినా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.నేచురల్ ప్రోటీన్, అంటే అది చికెన్, గుడ్డు కావచ్చు లేదంటే ప్లాంట్ ప్రోటీన్ కావచ్చు .ఇవే ఎక్కువ తీసుకోవాలి.లేదంటే urea cycle disorder (UCD) ఉన్నవారు మాత్రమే కాదు, ఆ సమస్య లేనివారు కూడా లేని సమస్యలు కొనితెచ్చుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube