ఆ సీన్లు అంటే ఇబ్బంది అంటున్న మెగా హీరో

డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్ లో అందరితో శభాష్ అనిపించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.మెగా ఫ్యామిలి హీరోగా వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్న ధరమ్ తేజ్ అన్ని విషయాల్లో ఆరి తేరినా ఒక్క విషయంలో మాత్రం తను చాలా వీక్ అంటున్నాడు.

 Feeling Uneasy With Romantic Scenes Says Mega Hero-TeluguStop.com

అవును సాయి ధరమ్ తేజ్ కి రొమాంటిక్ సీన్లలో నటించడం ఇబ్బందిగా ఉంటుందట.రోమాన్స్ అస్సలు పంచిచడం రాదు నాకు, అంత మందిలో రొమాంటిక్ గా బిహేవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నాడు తేజ్.

తన కొత్త చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో రెజినా కథానాయిక అన్న విషయం తెలిసిందే.అసలే అమ్మడు చాలా ఫాస్ట్, ఈ మధ్య కాలంలో వచ్చిన తన సినిమాలన్నిటిలోనూ ముద్దు సన్నివేశాల్లో నటించింది.

ఆసలే రోమాన్స్ అంటేనే ఆమడ దూరం పరిగెత్తే సాయి ధరమ్ తేజ్ కి రెజినా తగిలితే .ఇంకేం ఉంది బెంబేలెత్తిపోయాడట తేజ్.ఏ రొమాంటిక్ సీన్ కుడా సరిగా పండించలేకపోయాడట.విషయం అర్థం చేసుకున్న రెజినా తేజ్ తో మాట్లాడి, తన టెన్షన్ పోగొట్టి, క్లోజ్ గా మూవ్ అయ్యేలా ధైర్యం చెప్తే కాని తేజ్ మళ్ళి షూట్ మొదలు పెట్టలేదని ఫిలిం నగర్ టాక్.

ఎక్కడైనా, హీరోయిన్లు భయపడతారు రొమాంటిక్ సన్నివేశాలంటే, కాని ఇలా హీరో భయపడటం ఇదే మొదటిసారేమో కదా !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube