వాలెంటైన్స్ వారం - రెండు ప్రేమకథలు రెడీ

సంక్రాంతి కి వరస సినిమాలతో సినిమా పరిశ్రమ కళ కళ లాడిపోయింది .క్రేజ్ తో పాటు హైప్ కూడా కలగలిసిన సినిమాలు కోకొల్లలుగా వచ్చిపోడ్డాయి.

 February 12th Two Movies Feb 14th Valetines Day-TeluguStop.com

ఒకే సారి నలుగు సినిమాలు తక్కువ గ్యాప్ తో రావడం నాలుగూ హిట్ అవడం కూడా ఇదే తొలిసారి కాబోలు.ఆ తరవాత వరసగా రెండు వారాల పాటు ఒక్కటంటే ఒక్కటి కూడా పెద్ద సినిమా రాలేదు, అసలు పస లేని సినిమాలు మన థియేటర్ లలోకి వచ్చాయి.

వాటి మీద జనాలు కూడా అసలు ఆసక్తి చూపించలేదు కానీ ఈ వారం మాత్రం రెండు సినిమాలూ సూపర్ గా ఉండబోతున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు.

ఈ రెండిట్లో నాని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు రిలీజ్‌కు ముందు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ ఉంది.

మూవీ టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కూడా అంచనాలను రెట్టింపు చేశాయి.పేరులోనే ప్రేమ గాథను నింపుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ వీకెండ్‌లో సూపర్ కలెక్షన్స్ సాధించే అవకాశం కనిపిస్తోంది.

ఇక రెండో సినిమా ‘గరం’ విషయానికి వస్తే సాయికుమార్ తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మించిన ఈ సినిమా కూడా పోస్టర్స్, ట్రైలర్‍తో బాగా ఆకట్టుకుంది.రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమగా తెరకెక్కిన ఈ సినిమా కూడా వాలెంటైన్స్ వీక్‌లో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.

మొత్తమ్మీద సంక్రాంతి తర్వాత నెలరోజులకు రెండు క్రేజ్ ఉన్న సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube