కులాంతర వివాహాలను చాలా కుటుంబాలు ఆమోదిస్తున్నప్పటికీ గ్రామీణ భారతంలో ఇంకా వ్యతిరేకత కనబడుతూనే ఉంది.ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో కుల కట్టుబాట్లు ఇప్పటికీ బలంగా ఉన్నాయి.
కులాంతర వివాహాన్ని పెద్ద అపరాధంలా చూస్తున్నారు.కఠిన శిక్షలు కూడా విధిస్తున్నారు.
ఉత్తర భారతంలోని చాలా గ్రామాల్లో గ్రామ పెద్దలే తీర్పులు చెప్పి శిక్షలు వేస్తుంటారు.వీటిని ‘ఖాప్ పంచాయతీ’ అంటారు.
ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకున్నవారికి భారీగా జరిమానాలు విధిస్తారు.గ్రామ బహిష్కార శిక్ష విధిస్తారు.
అవసరమైతే ప్రేమికుల్లో ఒకరిని హత్య కూడా చేయిస్తారు.ఈ దుర్మార్గం అక్కడ చాలా ఎక్కువ.
బీహార్లోని ఓ గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న జంటను గ్రామ పెద్దలు యాభైవేల రూపాయలు డిమాండ్ చేశారు.ఇంత డబ్బు ఎందుకంటే ఈ జంటకు రక్షణ కల్పించడానికట.
అంత డబ్బు ఇచ్చుకోలేని ఈ జంట గ్రామస్తులకు భయపడి ఊరు విడిచి పారిపోయింది.సొంత ఊరికి మూడొందల కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి పారిపోయారు చోటుకుమార్ యాదవ్, సోనిదేవి అనే ప్రేమికులు.
చోటుకుమార్ ఆ గ్రామంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.పిల్లలు కులాంతర వివాహం చేసుకుంటే వారి తల్లిదండ్రులను శిక్షస్తారు కూడా.
ఇక్కడి ప్రేమ కథలు తెలుగు సినిమాలను తలపిస్తాయి.