వెస్ట్రన్ దేశాల్లో, యూరప్ దేశాల్లో స్వలింగ సంపర్కం అనేది చాలా కామన్ విషయం అయిపోయింది.కొంతమంది హాలివుడ్ సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా స్వలింగ సంపర్కులు కావడంతో, ఆ ప్రభావం యువతపై కూడా పడుతోంది.
ఇది మంచా, చెడా అనేది మనకు అనవసరం కాని, ఎవరి జీవితాన్ని వారు తనకి నచ్చినట్లుగా బ్రతికేతేనే కదా, వారి జీవితానికి అర్థం ఉండేది.ఇప్పుడు ఇదంతా ఎందుకు అని మీరు అనుకుంటే, డైరెక్టుగా ఓ విషాదకరమైన విషయంలోకి వెళ్ళిపోదాం.
ఇంగ్లాండ్ కి చెందిన ఓ పదహారేళ్ళ అమ్మాయి, అబ్బాయిల పట్ల కాకుండా, అమ్మాయిల పట్ల ఆకర్షితురాలవుతోంది.అంటే, ఈ టీనేజ్ అమ్మాయి లెస్బియన్ గా ఉండేందుకు ఇష్టపడిందన్నమాట.
ఈ విషయం తన తండ్రికి తెలిసింది.దాంతో ఆ దుర్మార్గుడు ఏం చేసాడో తెలుసా ? తన కూతురు లెస్బియన్ గా ఉండటం నచ్చకపోతే, పదహారేళ్ళున్న తన అమ్మాయికి మంచి చెడు చెప్పాలి, లేదంటే తన జీవితం, తన ఇష్టం అని వదిలేయాలి .కాని సొంత కూతురినే రేప్ చేసాడు.కారణం ఏమిటి అని అనుకుంటున్నారు?
మగవారితో సెక్స్ ఎలా ఉంటుందో రుచి చూపించటం కోసం అంట.లెస్బియన్ గా ఉండటం కంటే, మగవారిపట్ల ఆకర్షితులవడం మంచిది అని ఆ అమ్మాయికి తెలియజెప్పటం కోసం అంట.56 ఏళ్ళ వయసులో ఉన్నా, మానవత్వం లేని మృగంలా ప్రవర్తించాడు.ఇది మొదటిసారి కాదు, ఈ మహానుభావుడు తన పెద్ద కూతురిని కూడా లైంగికంగా వేధించేవాడట.దాంతో ఆ అమ్మాయి ఇల్లు విడిచిపెట్టిపోయింది.ఇప్పుడు చిన్నకూతురినేమో, లెస్బియన్ గా మారుతోంటే రేప్ చేసాడు, అది కూడా దారుణమైన కారణంతో.
ఈ కామాంధుడికి తగిన శిక్ష విధించింది కోర్టు.21 ఏళ్ళు జైల్లో గడపనున్నాడు ఈ మనిషి రూపంలో ఉన్న జంతువు.ఈ సంఘటనతో ఇంగ్లాండ్ మొత్తం నిరసనలు చేస్తున్నారు స్వలింగ సంపర్కులు.
ఒకే సెక్స్ వారు పెళ్ళిచేసుకోవడం లీగల్ ఈ దేశంలో.అయినా, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.