బ్యాంక్ ముందు రైతుల గగ్గోలు

ఏ సుముహూర్తాన చంద్రబాబు రైతుల రుణమాఫీ నెత్తికెత్తుకున్నారో అక్కణ్ణించి రైతులకు పడరాని పాట్లు అన్ని వైపులనుంచి ఎదురయ్యాయి .ఈరోజు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆంధ్రాబ్యాంకులో తమ బంగారం వేలం వేశారని ఇందుకు గల కారణం మాకు తెలియాలి అని పెద్దఎత్తున రైతులు బ్యాంకును చుట్టుముట్టారు.

 Farmers Dharna  In Front Of Andhra Bank-TeluguStop.com

మంగళవారం మధ్యాహ్నం వేగేశ్వరపురం ఆంధ్రాబ్యాంకు ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.రైతు నాయకులు బుద్దాల గాంధీ, బి పుల్లారావు, తైలం సత్యనారాయణ, శంకాబత్తుల తులసీరత్నం తదితరులు మాట్లాడుతూ వడ్డీ చెల్లించినప్పటికీ తమ అప్పులు తిరగరాయకుండా, నోటీసు ఇవ్వకుండా బంగారం వేలం వేశారని, మిగిలిన పైకాన్ని చెక్కు రూపంలో పంపించారని ఆవేదనతో తెలియచేసారు .రెగ్యులర్ గా బ్యాంకు ఇచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాము అలాగే,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణాలు మాఫీ చేస్తారని ఎదురు చూశామని, అప్పులు పోలేదని తెలిసి వడ్డీ చెల్లించి బాంకు వారికి తిరగరాయమంటే మా తాకట్టు బంగారం వేలం వేశారని చాలా దుర్మార్గమని ఆవేశ పడ్డారు దీనిపై బ్యాంకు మేనేజర్ డి చెంచయ్య మాట్లాడుతూ బ్యాంకు 2011-13 సంవత్సరాల్లో బాకీలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి రైతులు మా నోటీసులకు ఖాతరు చేయనందుకే వేలం వేశామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube