చిరంజీవి సందేశాన్ని రైతులు పట్టించుకుంటారా?

వెండితెరకి ఆయన మెగాస్టార్ కావచ్చు.కాని మేకప్ తీసి చూస్తే, స్థితిగతులు మారిపోతాయి.

 Will Farmers Accept Chiranjeevi’s Reel Messages And Doings?-TeluguStop.com

రాజకీయాల్లో పరాజయం పక్కనపెడితే, వ్యక్తిగతంగా చిరంజీవి ఇమేజ్ గత పదేళ్ళలో బాగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి.మరి రాజకీయాల్లో ప్రజల మన్నన పొందని చిరంజీవి ఇప్పుడు సినిమాల్లో సందేశాలిస్తే ప్రజలు ఒప్పుకుంటారా ?

గత దాశాబ్ద చిరంజీవి రైతులకోసం ఏం చేసారో మనకు తెలీదు.కాని, ఏం చేయలేదో రైతులకి తెలుసు.మరి ఇప్పుడు ఖైదీ నం150 చిత్రంలో చిరంజీవి రైతుల కోసం పోరాడుతుంటే, ఆయన ఒక పొలిటిషియన్ అన్న సంగతి మర్చిపోయి, కేవలం నటుడిగా చూస్తారా ప్రేక్షకులు? ముఖ్యంగా ఆయనిచ్చే సందేశాలు రైతులకి నచ్చుతాయా? ఎద్దేవా చేయరు కదా?

సినిమా విడుదలయ్యాక రైతులు, రైతు సంఘాల నాయకులు ఎలా స్పందిస్తారో అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఖైదీనం 150 సందేశాత్మక చిత్రం కాబట్టి, రాజకీయాలను ప్రస్తావించే సినిమా కాబట్టి, చిరంజీవి పొలిటికల్ కెరీర్, ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube