పవన్‌ షాకింగ్‌ నిర్ణయం.. ఫ్యాన్స్‌ ఆందోళన

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఆ చిత్రం వచ్చే సంవత్సరం ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

 Fans Worry About Pawan Shocking Decision-TeluguStop.com

ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన దాసరి నిర్మాణంలో ఒక చిత్రంలో నటించే అవకాశాలున్నాయి.చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ అధికారిక ప్రకటన వచ్చింది.

అయితే పవన్‌ ఇతర కారణాల వల్ల సినిమాను హోల్డ్‌లో పెడుతూ వస్తున్నాడు.ప్రస్తుతం చేస్తోన్న సర్దార్‌ పూర్తి అవ్వగానే దాసరి బ్యానర్‌లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

పవన్‌ హీరోగా దాసరి నిర్మాణంలో తెరకెక్కబోతున్న చిత్రంకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి.ఈ సినిమాకు స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అందిస్తాడని దాసరి కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు.

తాజాగా ఈ చిత్రానికి స్వయంగా తానే దర్శకత్వం వహించాలని దాసరి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.దాసరి దర్శకత్వంకు పవన్‌ కళ్యాణ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ సమాచారం అందుతోంది.

గత కొంత కాలంగా పెద్దగా సత్తా చాట లేక పోతున్న దాసరి దర్శకత్వంలో పవన్‌ సినిమా అంటే ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.పవన్‌ నిర్ణయం మార్చుకోవాలని కోరుతున్నారు.

మరి పవన్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube