చిరంజీవి - రామ్ చరణ్ పై మహేష్ మనుషుల కుట్ర?

ట్రేడ్ లెక్కల్లో ఖైదీ నం 150 షేర్ కలెక్షన్లు 100 కోట్లు.89 కోట్లకు అమ్ముడుపోతే, 100 కోట్ల షేర్ వసూలు చేసి బయ్యర్లకు 11 కోట్ల లాభాల్ని ఇచ్చిందన్నమాట.నిర్మాతగా రామ్ చరణ్ మాత్రం సాటిలైట్ కలుపుకోని 35-45 కోట్ల లాభాల్ని వేసుకున్నట్లే లెక్క.అయితే ప్రశ్నించడానికి వచ్చిన ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకి మాత్రం రామ్ చరణ్ ఈ సినిమా 75 కోట్ల షేర్ వసూలు చేసిందని, నిర్మాతగా తనకి 15 కోట్ల లాభం వచ్చిందని చెప్పినట్లు ఓ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఓ వార్తను ప్రచురించింది.

 Fake Propaganda On Chiranjeevi And Ram Charn By Mahesh Fans?-TeluguStop.com

ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టాలివుడ్.

ట్యాక్స్ తక్కువ కట్టేందుకు రామ్ చరణ్ నిజంగానే అలా తక్కువ చెప్పాడా లేక నిజంగానే ఖైదీ కేవలం 75 కోట్ల షేర్ వసూలు చేసిందా? అసలు ఇదంతా కాదు, అసలు రామ్ చరణ్ ఇంటికి ఇన్ కమ్ ట్యాక్స్ వారు రావడం, రామ్ చరణ్ వారికి ఇలాంటి లెక్కలు చెప్పడం .ఈ వార్తలో ఎంత నిజముంది?

ఇది ఓ మహేష్ బాబు ఫ్యాన్ పన్నిన కుట్రే అని వాదిస్తున్నారు మెగా ఫ్యాన్స్.అసలు మహేష్ అభిమానులకి దీనికి లింక్ ఏంటి అనేగా మీ డౌటు? ఆ దినపత్రికలో ఆ వ్యాసాన్ని రాసిన రైటర్ మహేష్ కి విరాభిమాని కావడం ఇక్కడ పాయింట్.

మామూలుగా అలాంటి పెద్ద ఇంగ్లీష్ దినపత్రికల్లో వ్యాసల పక్కనే రైటర్ పేరు కూడా ఉంటుంది.పైగా ఆయన ఫేమస్ జర్నలిస్టు కదా.ఇంకేం, మెగా ఫ్యాన్స్ పనిగట్టుకోని ఆ జర్నలిస్టు ఫేస్ బుక్ ప్రొఫైల్ అంతా వెతికారు.దాంతో అతను మహేష్ ఫ్యాన్ అని తేలింది.

శ్రీమంతుడు రికార్డులని ఖైదీ నం 150 దాటడం వలనే, అది జీర్ణించుకోలేక మహేష్ అభిమానులు చిరంజీవి – రామ్ చరణ్ మీద ఇలా కుట్ర పన్ని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube