ఫేక్ కలెక్షన్లు .. బాలయ్య బాబు కూడా

చూస్తుండగానే బాలకృష్ణ వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి 50 రోజులు పూర్తి చేసుకుంది.చేసిన బిజినెస్ కి, కలెక్ట్ చేసిన షేర్ కి ఈ సినిమాని హిట్ గా చెప్పుకోవచ్చు.

 Fake Collection Reports From Gpsk Producers?-TeluguStop.com

కాబట్టి, ఒకటి రెండు చోట్ల తప్పిస్తే, పంపిణిదారులు సేఫ్ అన్నమాట.ఇక సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటే 50-52 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది.47-48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కి ఇది ఫర్వాలేనిపించే రికవరియే.

అయితే, గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మాతలు ఈ చిత్రం 77 కోట్ల రాబడి పొందింది అని 50 రోజుల పోస్టర్ ఒకటి వదిలారు.

ఈ పోస్టర్ ట్రెడ్ జనాల బుర్రకి అర్థం కావడం లేదు.వచ్చిన షేర్ కి సాటిలైట్ రైట్స్, మిగితా హక్కులు కలుపుకున్నా, 60-62 కోట్ల రాబడి మాత్రమే కనబడుతోంది.

మిగితా 15 కోట్లు ఎక్కడివి? ఫేక్ కలెక్షన్లు ప్రచారం చేయాలని చూస్తున్నారా?

అలాకాదు, గ్రాస్ కలెక్షన్లు చెబుతున్నారా? ఈ సినిమా దాదాపుగా 78-80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.గ్రాస్ కలెక్షన్లని రాబడి అని ఎవరు చెప్పుకోరు కదా .సో, ఆ 77 కోట్లు గ్రాస్ కూడా కాదు.ఏమిటో ఈ పబ్లిసిటి లెక్కలు .నిర్మాతలకే తెలియాలి.

అయినా, ఇందులో హీరోని తప్పుబట్టడానికి ఏమి లేదులేండి.

పది రూపాయలు వస్తే, దాన్ని పదమూడు, పధ్నాలుగుగా చూపించడం ఎప్పటినుంచో తెలుగు నిర్మాతలకి ఉన్న అలవాటేగా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube