Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఫేక్ కలెక్షన్లు .. బాలయ్య బాబు కూడా-Fake Collection Reports From GPSK Producers?

చూస్తుండగానే బాలకృష్ణ వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి 50 రోజులు పూర్తి చేసుకుంది. చేసిన బిజినెస్ కి, కలెక్ట్ చేసిన షేర్ కి ఈ సినిమాని హిట్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి, ఒకటి రెండు చోట్ల తప్పిస్తే, పంపిణిదారులు సేఫ్ అన్నమాట. ఇక సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటే 50-52 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. 47-48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కి ఇది ఫర్వాలేనిపించే రికవరియే.

అయితే, గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మాతలు ఈ చిత్రం 77 కోట్ల రాబడి పొందింది అని 50 రోజుల పోస్టర్ ఒకటి వదిలారు. ఈ పోస్టర్ ట్రెడ్ జనాల బుర్రకి అర్థం కావడం లేదు. వచ్చిన షేర్ కి సాటిలైట్ రైట్స్, మిగితా హక్కులు కలుపుకున్నా, 60-62 కోట్ల రాబడి మాత్రమే కనబడుతోంది. మిగితా 15 కోట్లు ఎక్కడివి? ఫేక్ కలెక్షన్లు ప్రచారం చేయాలని చూస్తున్నారా?

అలాకాదు, గ్రాస్ కలెక్షన్లు చెబుతున్నారా? ఈ సినిమా దాదాపుగా 78-80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్లని రాబడి అని ఎవరు చెప్పుకోరు కదా .. సో, ఆ 77 కోట్లు గ్రాస్ కూడా కాదు. ఏమిటో ఈ పబ్లిసిటి లెక్కలు .. నిర్మాతలకే తెలియాలి.

అయినా, ఇందులో హీరోని తప్పుబట్టడానికి ఏమి లేదులేండి. పది రూపాయలు వస్తే, దాన్ని పదమూడు, పధ్నాలుగుగా చూపించడం ఎప్పటినుంచో తెలుగు నిర్మాతలకి ఉన్న అలవాటేగా.

Continue Reading
To Top