వాంతులు - వింత విషయాలు-Facts You Should Know About Vomiting 4 months

Emetophobia Psychological Problems Syndrome Vomiting Most Common Problemcyclic వాంతులు - వింత విషయాలు Photo,Image,Pics-

వాంతులు సర్వసాధారణంగా కనిపించే సమస్య. మనందరికీ ఎప్పుడో ఒక్కప్పుడు ఈ సమస్య ఎదురయ్యే ఉంటుంది. ఈ వాంతి అంటే ఏమిటి ? సింపుల్ గా చెప్పాలంటే సరిగా జీర్ణం కాని ఆహారం మలద్వారం ద్వారా కాకుండా, నోట్లోంచి, ముక్కులోంచి బయటకిరావడం. దీనికి కారణాలు ఒకటి రెండు అని చెప్పలేం. అది తిండి సరిగా జీర్ణం కాకపోవడం కావచ్చు, గర్భం కావచ్చు, అతిగా తినడం కావచ్చు, వైరల్ ఇంఫెక్షన్ కావచ్చు, తిన్న తిండి ఒంటికి పడకపోవడం కావచ్చు .. ఇలా చెప్పుకుంటే పోతే చాలా పెద్ద లిస్టు తయారవుతుంది. అవన్నీ మీకు తెలియనివి కావు కాని, ఇక్కడ వాంతుల గురించి మీకు అవగాహన లేని వింత విషయాలు తెలుసుకోండి.

* పెద్దగా కారణం లేకుండా కూడా వాంతులు అయితే? ఇదేం వింత అని ఆశ్చర్యపోతున్నారా ! దీన్నే సైక్లిక్ వామిటింగ్ సిండ్రోమ్‌ అని అంటారు. ఈ కండీషన్ లో కారణాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా తరుచుగా వాంతులు చేసుకుంటారు.

* వేరే ఎవరో వాంతి చేసుకుంటుంటే చూసి, లేదా తమకు తామే వాంతి చేసుకుంటున్నట్లు ఊహించుకోని, వాంతుల మీద భయం పెంచుకుంటారు కొంతమంది. దీన్నే ఎమెటోఫోబియా అని అంటారు.

* వాంతి చేసుకున్నప్పుడు అలా శుభ్రం చేసుకోని వెళ్ళిపోవడమే కాదు. అది ఏ రంగులో బయటపడిందో కూడా గమనించాలి. ఒకవేళ వామిటింగ్ బ్లాక్ లేదా రెడ్ కలర్ లో పడితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

* వాంతి జరగటం కొన్నిసార్లు మంచిదే. అప్పుడప్పుడు మన శరీరం లోన ఉన్న ఇంఫెక్షన్ ని వాంతి రూపంలో బయటకి పంపిస్తుంది.

* చిన్నపిల్లలో వామిటింగ్ ప్రతిసారి వైరల్ ఇంఫెక్షన్ వలనే రాదు. ఆసిడ్ రిఫ్లెక్సు, తీవ్రమైన తలనొప్పి కూడా దీనికి కారణం కావచ్చు. ఈ కారణాలవల్ల వయసులో ఉన్నవారికి కూడా వాంతులు రావొచ్చు.

* కొన్నిసార్లు మన మానసిక సమస్యలు కూడా వాంతులకి దారితీయవచ్చు. స్ట్రెస్, డిప్రేషన్ వలన మెదుడులో జరిగే కెమికల్ మార్పుల వలన కూడా వాంతులు జరగొచ్చు.

* అదేపనిగా వాంతులు వస్తే అది ప్రాణాంతకంగా కూడా మారొచ్చు, ముఖ్యంగా రక్తం బయటకు వస్తే. సమస్య మొదటి దశలో ఉండగానే చికిత్స మొదలుపెట్టాలి.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...కొబ్బరినీళ్ళు రెగ్యులర్ గా ఎందుకు తాగాలి?

About This Post..వాంతులు - వింత విషయాలు

This Post provides detail information about వాంతులు - వింత విషయాలు was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Vomiting most common problemcyclic vomiting , syndrome, emetophobia, black or red color Vomiting's , psychological problems, వాంతులు - వింత విషయాలు

Tagged with:Vomiting most common problemcyclic vomiting , syndrome, emetophobia, black or red color Vomiting's , psychological problems, వాంతులు - వింత విషయాలుblack or red color Vomiting's,emetophobia,psychological problems,syndrome,Vomiting most common problemcyclic vomiting,వాంతులు - వింత విషయాలు,,Chandralekha Film Bed Scene Pics,Emetophobia Doctor Mumbai,Emetophobia Facts,Emetophobia In Mumbai,Nithin Family Photos And Videos