వివాహం చేసేటప్పుడు పెద్దలు వధూవరులిద్దరి జాతకాలను చూసి ఆ తర్వాతే వారిద్దరికీ వివాహం చేయటం పరిపాటి.పెద్దలు పరిశీలించే అంశాలలో కుజ దోషం ప్రధానమైనది.
ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి.ఈ అపోహల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.
ఏ మనిషికి అయినా సరే జన్మ లగ్నం నుండి 2,4,7,8,12 స్థానాలలో కుజుడు ఉన్నా, ఆ స్థానాలకు కుజ దృష్టి తగిలిన, అది స్త్రీల భర్త్రు భావానికి,పురుషుల కళత్ర భావానికి హాని కలిగిస్తుందని – అలాంటి జాతకులకు వివాహం చేయరాదని పెద్దలు ఆదేశం.
కుజ దోషం అందరూ భయపడే అంత భయంకరమైనది కాదు.
వధూవరుల ఇద్దరి జాతకాలలో కుజ దోషం సమానంగా ఉంటే వివాహం చేయవచ్చని శాస్త్రం చెప్పుతుంది.అలాగే మేషం,కర్కాటకం,సింహం,వృశ్చికం,ధనస్సు,మీనా రాసులు సప్తమంలో ఉండి – ఆ రాశులలో కుజుడు ఉంటే శుభమే చేస్తాడు.
కాబట్టి కుజ దోషం గురించి ఎక్కువగా అపోహ పడకుండా మిగతా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోని వివాహాలు చేయాలి.