అతిమద్యం వలన తలనొప్పి కలిగితే ఏం చేయాలి?

మద్యం అతిగా తాగితే మత్తు ఎలాగో వస్తుంది.దాంతోపాటు తలనొప్పి కూడా వచ్చేస్తుంది అప్పుడప్పుడు.

 Excellent Tips To Get Rid Of Hangover-TeluguStop.com

ఆ నొప్పి భరించలేనట్టుగా ఉంటుంది.దీన్నే మందుబాబుల భాషలో హ్యాంగ్ ఓవర్ అని అంటారు.

అలాంటి సమయంలో ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు చూడండి.

* మొదట చేయాల్సిన పని, నీళ్ళు బాగా తాగడం.

సాధ్యమైనంత వరకు, ఇక చాలు అనిపించేంతలా నీళ్ళు తాగండి.

* మంచినీరు మాత్రమే కాదు, పండ్ల రసం, ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్ తాగండి.

* హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు కెఫైన్ ఉండే పదార్థాలు, ముఖ్యంగా కాఫీ అస్సలు తీసుకోవద్దు.అలాంటి సమయంలో ఒంట్లో కెఫైన్ పడితే, తలనొప్పి ఇంకా పెరుగుతుందే తప్ప, తగ్గదు.

* ఉడకబెట్టిన గుడ్లు తినండి.అమినో ఆసిడ్స్ కలిగిన గుడ్లు, మద్యం వలన ఒంట్లో చేరిన టాక్సిన్స్ ని బయటకు తెస్తాయి.

దాంతో హ్యాంగోవర్ తగ్గుతుంది.

* పొటాషియం ఎక్కువ ఉండే పదార్థాలు తినాలి.

అంటే, అరటిపండు లాంటివి అన్నమాట.

* కాసేపు నిద్రతీస్తే అదే సర్దుకుంటుంది.

ఓపిక ఉండి, కాసేపు అలా నడిస్తే ఇంకా బెటర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube