Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

50 ఏళ్ళు దాటినా, శృంగారం మహిళ హక్కు .. తేల్చి చెప్పిన కోర్టు -$ex For Women After 50 Is A Basic Right – European Court Declares

దేశాలు మారినా, మహిళకి శృంగారం అంటే కేవలం పిల్లలని కనడం కోసం చేసే పని అని భావించే మహానుభావులు ఉంటారు. ఇది అభివృద్ధి చెందిన వెస్ట్రన్, యూరోప్ దేశాల్లో కూడా ఉంది. అక్కడ కూడా ఇలా భావించే వారు ఉంటారు. ఆ భావన వలనే ఓ మహిళకి 50 ఏళ్ల వయసులో ఓ అన్యాయం జరిగింది. అయితే ఆమె పోరాటం ఆపలేదు. సొంత దేశానికి సంబంధించిన న్యాయస్థానం తనకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా, శృంగారం తన హక్కు అని 72 ఏళ్ల వయసులో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ వృద్ధురాలి పేరే మరియా మొరాయిస్.

1993 లో ఈవిడానికి ఎదో పెద్ద వేజైనల్ జబ్బు వచ్చిందట. అంటే స్త్రీ మర్మాంగానికి సంబంధించిన ఓ వ్యాధి. 1995 లో ఆ వ్యాధికి సంబంధించి ఓ సర్జరీ చేయించుకుంది. అప్పుడు ఆమె వయసు 50 సంవత్సరాలు. ఆ సర్జరీలో డాక్టర్ల చిన్న తప్పిదం వలన ఆమె శృంగార జీవితానికి పనికిరాకుండా పోయింది. ఒకవేళ భర్తతో శ్రుంగారించేందుకు ప్రయత్నించినా, యోనిలో భరించలేని నొప్పి వేయడంతో శృంగారాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ హాస్పిటల్ వారు కొంత నష్టపరిహారం ఇస్తామనన్నారు, సరిపోదు అంటూ కోర్టుకి వెళ్ళింది.

Continue Reading
More Posts
To Top