మాజీ సీఎం కిర‌ణ్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ..! ఆ పార్టీలోకేనా..!

ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రంలో ఆఖ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందా ? ఆయ‌న తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్ కాబోతున్నారా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు ఏపీ పొలిటిక‌ల్ ఇన్న‌ర్ కారిడార్‌లో వినిపిస్తున్నాయి.స‌మైక్యాంధ్ర‌కు చివ‌రి సీఎంగా ఓ వెలుగు వెలిగిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

 Ex Ap Cm Kiran Kumar Reddy Political Re-entry-TeluguStop.com

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిర‌ణ్ జై స‌మైక్యాంధ్ర పార్టీ స్థాపించి ఎన్నిక‌ల్లో పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారు.త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో త‌న త‌మ్ముడు సైతం ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా జై స‌మైక్యాంధ్ర పార్టీ ఒక్క‌సీటు కూడా గెలుచుకోలేదు.ఎన్నిక‌ల్లో ఓడిపోయాక ఆయ‌న రాజ‌కీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

త‌ర్వాత కిర‌ణ్ వైసీపీలోకి, జ‌న‌సేన‌లోకి, బీజేపీలోకి వెళ‌తార‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు పుకార్లు షికార్లు చేశాయి.మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

కిర‌ణ్ గ‌త రెండున్న‌రేళ్లుగా ఏ రాజ‌కీయ కార్య‌క్ర‌మంలోను క‌నిపించ‌లేదు.కొద్ది రోజుల క్రితం మాత్రం ఆయ‌న పెళ్లి కూతురు రెడీగా ఉంద‌ని, పెళ్లి చేసుకోవ‌డ‌మే లేట్ అంటూ త‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పోయిన చోటే వెతుక్కోవాల‌న్న చందంగా తిరిగి కాంగ్రెస్ గూటికే వెళితే ఎలా ఉంటుంద‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.కాంగ్రెస్‌లోకి తిరిగి రప్పించేందుకు బెజ‌వాడ కాంగ్రెస్ నేత మ‌ల్లాది విష్ణు మంత‌నాలు చేస్తున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నారు.

మ‌రి మాజీ సీఎం నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌నేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube