Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

రామాయణ మహాభారతాల్లో ఉన్న అసలు మాహిష్మతి ? దాని చరిత్ర ఏమిటి ?-Everything You Should Know About The Real “Mahishmati” Kingdom

“మాహిష్మతి .. సామ్రాజ్యం .. ఆస్మాకం .. అజేయం” అంటూ బాహుబలి మొదటిభాగం ఆడియో విడుదల అయినప్పటినుంచి పాడకుంటున్నాం. మనవరకు అయితే ఈ మాహిష్మతి అనే సామ్రాజ్యం పేరు వినడం అప్పుడే మొదటిసారి. సినిమా చూసాక మాహిష్మతి నిర్మాణాన్ని చూసి అబ్బురపోయాం. రాజమౌళి ఊహాశక్తిని చూసి వందల కోట్లు బహుమానంగా ఇచ్చేసాం. కాని ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాహిష్మతి అనే పేరుతొ నిజంగానే ఏదైనా రాజ్యం ఉందొ లేదో ?

మాహిష్మతి అనే పేరుతో నిజంగానే రాజ్యం ఉండేది. ఎక్కడో కాదు మన దేశంలోనే. అయితే ఆ రాజ్యం వేరు రాజమౌళి మాహిష్మతి వేరు. రాజ్యం పేరు మాత్రమే వాడుకున్నారు. భావన నిర్మాణాలు, యుద్దరీతులు .. అన్ని రాజమౌళి సృష్టించినవే. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో సృష్టించిన మాహిష్మతికి, అసలైన మాహిష్మతికి చాలా తేడాలున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. అసలైన మాహిష్మతి రాజ్యం గురించి ముచ్చట్లు తెలుసుకోండి.

రామాయణంలో మాహిష్మతి వివరాలున్నాయి తెలుసా ? ఇక్ష్వాకు కొడుకు దశాశ్వ మాహిష్మతిని పరిపాలిస్తున్నప్ప్పుడు రావణుడు మాహిష్మతిపై దాడికి దిగాడట. పద్మపురాణంలో కూడా మాహిష్మతి గురించి సమాచారం ఉంటుంది. దీనిని నిర్మించిన రాజు పేరు మాహిష అని కొన్న్ని గ్రంధాలలో ఉంటే, ఆ రాజు పేరు మాహిష్మాంత్ అని మరికొన్ని గ్రంథాల్లో ఉంది. ఇద్దరు ఒకరేనా కాదా అనే విషయం తెలియదు. కాని ఎవరు నిర్మించినా, ఆ రాజు పేరు మీదే దీనికి మాహిష్మతి అనే పేరు వచ్చింది అనే సుస్పష్టం అవుతోంది.

Continue Reading
To Top