జియో ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు

ఎప్పుడెప్పుడా అని భారతీయ ప్రజలు ఎదురుచూస్తున్న జియో ఫోన్ ప్రకటన రానే వచ్చేసింది.నిన్న జరిగిన సమావేశంలో ముఖేష్ అంబాని ఈ సంచలనాత్మక మొబైల్ ని ప్రపంచానికి పరిచయం చేసారు.

 Everything You Should Know About Jio Phone (4g)-TeluguStop.com

దీని పేరు జియో ఫోన్.దీనికి మళ్ళీ తల తోక ఏమి అంటించలేదు.

ఇది పూర్తిగా స్మార్ట్ ఫోన్ కాదు, అలాగని కేవలం ఫీచర్ ఫోన్ కాదు.రెండు కలిసిన హైబ్రిడ్ ఫోన్ లాంటిది అనుకోండి.

ఈ స్పెషల్ గురించి వింతలు విశేషాలు ఏంటో చూడండి.

* ఆగష్టు 15న మొబైల్ బేటా వెర్షన్ లాంచ్ అవుతోంది.

ఆగష్టు 24 నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతాయి.

* ఈ ఫోన్ ని మీరు పూర్తి ఉచితంగా పొందుతున్నట్లే లెక్క.ఎలా అంటే, ఈ ఫోన్ ని రూ.1500 పెట్టి బుక్ చేసుకోవాలి.మీరు కట్టిన ప్రతి రూపాయి మూడు సంవత్సరాల తరువాత రీఫన్డబుల్.అంటే, రూ.1500 ని మీరు మూడు సంవత్సరాల తరువాత రివర్స్ పొందవచ్చు.

* ఇది 4G ఫోన్.

LTE తో పాటు VoLTE నెట్వర్క్స్ పై పనిచేస్తుంది.

* ఇది 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.

* ఇందులో ఎమర్జెన్సి కాల్ ఆప్షన్ ఉంది.మీరు ముందే మీ సన్నిహితుడు/సన్నిహితురాలు ని సెలెక్ట్ చేసుకోవాలి.

మీరు ఎప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నా సరే, 5 బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే, మీరు ఎక్కడ ఉన్నారో, అ అడ్రెస్ ఎమెర్జెన్సి అనే మెసేజ్ తో ఆ వ్యక్తీ మొబైల్ కి వెళుతుంది.

* నెలకి రూ.153 రూపాయలు చెల్లిస్తే చాలు, అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 4G ఇంటర్నెట్ మీ సొంతం.అయితే ఒక్కరోజుకి 500 MB మాత్రమే హై స్పీడులో వాడుకోవచ్చు.

లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 128 KBPS కి పడిపోతుంది.

* ప్రతి నెల రీచార్జ్ ద్వారా జియో ప్రీమియం యాప్స్ అన్ని మీరు పూర్తి ఉచితంగా పొందవచ్చు.

* మీరు ఈ ఫోన్ ద్వారా టీవి కూడా చూడవచ్చు.ఈ ఫోన్ తో పాటే ఒక కేబుల్ వస్తుంది.

ఆ కేబుల్ ని టీవికి కనెక్ట్ చేసి, మొబైల్ లో మీరు ప్లే చేసే ప్రసారాలను టీవి తెరపై చూడవచ్చు.జియో టీవి యాప్ ద్వారా డిష్ కనెక్షన్ లేకుండానే, ఫోన్ తో టీవి చూడొచ్చు.అయితే ఈ సర్వీసు పొందాలంటే మాత్రం నెలకి రూ.309 ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాలి.

* డిజిటల్ పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.NFC సపోర్ట్ కూడా ఉండటం ఓ అద్భుతం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube