స్త్రీలకి అక్కడ నొప్పి వేయాడానికి ఇదే కారణం కావచ్చు

వుల్వోడైనియా … ఈ పదం ఎప్పుడైనా విన్నారా ? వినడానికి కొత్త సమస్యలా ఉన్నా, ఇది చాలా పాత సమస్య అలాగే చాలా కామన్ సమస్య.చెప్పాలంటే రొమ్ము క్యాన్సర్ కంటే ఎక్కువగా మహిళల్ని వేధించే సమస్య.

 Everything Women Should Know About Vulvodynia – Pain In Vagina-TeluguStop.com

ఒక్క ముక్కలో వుల్వోడైనియా ఏమిటి అంటే యోనిలో నొప్పి వేయడం.ఈ సమస్యలో క్లిటోరిస్, వజైనల్ ఓపెనింగ్, వుల్వా, చివరకి యోని బయట కూడా నొప్పి ఉంటుంది.

ఇలాంటివారికి శృంగారం సమయంలో విపరీతమైన నొప్పి వేస్తుంది.అలాగని వారికి శృంగారం మీద ఆసక్తి కాని భయం కాని ఉంటుంది అనుకునేరూ.

ఆసక్తి, కామోద్రేకం ఉన్నా, నొప్పి ముందు లొంగిపోతారు.ఇదొక పెయిన్ సిండ్రోం.

దీంట్లో రెండు రకాలు ఉంటారు.ఒకటి జెనరలైజ్ వుల్వోడైనియా ఉంటుంది అలాగే లోకలైజ్ వుల్వోడైనియా ఉంటుంది.

మొదటిరకం చాలా ఇబ్బందికరం.ఎలాంటి స్పర్శ లేకున్నా నొప్పి ఉండొచ్చు.

ఇలాంటి నొప్పులు నిజంగా నరకం.ఈ సమస్య ఉంటే శృంగారం గురించి ఆలోచించడం కూడా కష్టమే.

ఇక రెండోవ రకంలో చిన్న చిన్న స్పర్శలకి నొప్పి వేయొచ్చు లేక అంగప్రవేశం జరగగానే నొప్పి పుట్టవచ్చు.పర్టికులర్ గా ఈ సమస్య ఎందుకు వస్తుందో డాక్టర్స్ కి సరిగా అర్థం కాదు.

ఇన్ఫెక్షన్ తో వచ్చే నొప్పుల్ని కనిపెట్టవచ్చు, యోని గోడలు బిగుసుకుపోవడం వలన వచ్చే నొప్పి గురించి చెప్పవచ్చు కాని ఈ సమస్యకు ఖచ్చితంగా ఇదే కారణం అని చెప్పడం కష్టం అంట.కాని ఈ కింది కారణాల వలన వుల్వోడైనియా కలిగే అవకాశం ఉంటుంది.

* యాంటి బయోటిక్స్ విపరీతంగా వాడటం

* యీస్ట్ ఇన్ఫెక్షన్స్ తరుచుగా వస్తూ ఉండటం.

* యోని నరాలకి ఎప్పుడైనా, ఏదైనా గాయం.

* యోని దగ్గరి నరాల్లో క్రామ్ప్స్

* హార్మోనల్ మార్పులు

ఈ సమస్య ఉంది అనే విషయం సింపుల్ గా తెలుసుకోవచ్చు.కేవలం శృంగారం సమయంలోనే కాదు, ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా నొప్పి వేయవచ్చు.

కొందరికైతే సమస్య తీవ్రం అయ్యి కూర్చుంటే కూడా నొప్పి వేస్తుంది.కొందరికి దురద, మంట కూడా ఉంటుంది.

డాక్టర్ తో ఎలాగో డిస్కస్ చేయాలి.కాని మీవంతుగా ఈ సమస్యకి చికిత్స ఎలా చేసుకోవాలంటే :

* బెక్ద్ ఫుడ్స్ తినడం తగ్గించాలి.మూత్రంలో మంట పుట్టించగలిగే చాకోలేట్స్, బీన్స్, బెర్రిస్ తక్కువ తినాలి.

* కాటన్ అండర్ వియర్స్ వాడాలి.ప్యాంటిలు వదులుగా ఉండేలా చూసుకోవాలి.టైట్ ప్యాంటీలు వాడకూడదు.

* ప్యాంటిలు ఉతుకుతున్నప్పుడు ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారో గమనించండి.డాక్టర్ ని అడిగి సలహా తీసుకోండి.

* యోని ప్రాంతంలో షాంపూ చేరుకోకుండా చూసుకోండి.అలాగే ఏ సబ్బు పడితే ఆ సబ్బు వద్దు.

* మంచి ఆహారం, మంచి నిద్ర అవసరం.

* శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి పుడితే, వాటర్ బేస్డ్ లుబ్రికేంట్స్ మాత్రమే వాడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube