మెగా హీరోలంతా నష్టాలు ఇస్తూనే ఉన్నారు

గత ఏడాది మెగా హీరోలు ఫర్వాలేనిపించేలా రాణించారు.పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ చేరో ఒక డిజాస్టర్ ఇస్తే, బన్ని బంపర్ హిట్, చరణ్, సాయిధరమ్ తేజ్ చెరో యావరేజ్ ఇచ్చారు.

 Every Mega Hero Caused Losses This Year As Of Now-TeluguStop.com

ఇక ఈ ఏడాది ఒక్క మెగాస్టార్ తప్ప, ఇప్పటివరకైతే మిగితా హీరోలు చతికిలపడ్డారు.అయితే, నష్టాలు మాత్రం చిరంజీవి ఖాతాలో కూడా పడ్డాయి.

ఖైదీ నం150 హిట్ సినిమానే.దాదాపుగా 90 కోట్ బిజినెస్ కి 102-104 కోట్ల షేర్ సాధించి చాలామందిని నష్టాల నుంచి కాపాడుకుంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు అంటే మెగా ఫ్యాన్స్ నొచ్చుకుంటారేమో కాని, సినిమా ఎంత కలెక్ట్ చేసింది ముఖ్యం కాదు, పెట్టిన పెట్టుబడికి రాబడి ఎంత? దీనిమీదే ఫలితం ఆధారపడి ఉంటుంది.పైగా, ఖైదీనం 150కి నైజాంలో నష్టాలే వచ్చాయి.

ఓవర్సీస్ లో కూడా దాదాపుగా అంతే.అయితే మిగితా ఏరియాల్లో మాత్రం లాభలొచ్చాయి.

ఇక సాయిధరమ్ తేజ్ నుంచి ఫిబ్రవరిలో వచ్చిన విన్నర్ పెద్ద డిజాస్టర్ గా నిలిస్తే, కాటమరాయుడు సంగతి అదోరకం.సినిమాకి ఫ్లాప్ టాక్ రాలేదు.అయినా సినిమా ఫ్లాప్.60 కోట్లకి పైగా కలెక్షన్ .అయినా నష్టాలే.కారణం .బిజినెస్.ఎక్కువ రేట్లకి అమ్మడం.

కఠోరమైన నిజంగా అనిపించినా, కాటమరాయుడుతో తీవ్రమైన నష్టాలను చూస్తున్నాడు పంపిణీదారులు.ఇక మిస్టర్ గురించి ఏం చెప్పాలి ఎంత చెప్పాలి .గత ఏడాది బ్రహ్మోత్సవం .ఈ ఏడాది మిస్టర్ .జనాల్ని టార్చర్ పెట్టిన సినిమాలు.ఫలితం కూడా సినిమాకి తగ్గట్టే, పెట్టుబడి పెట్టినవారికి టార్చర్ చూపిస్తోంది.

ఇక మిగిలింది చరణ్, బన్నిలే.అన్ని ఏరియాల్లో లాభాలున్న సినిమా ఈ ఏడాది మెగాఫ్యామిలి నుంచి రాలేదు.

అందుకే డిస్ట్రీబ్యూటర్స్ ఆశలన్ని వీరిద్దరిపైనే.సుకుమార్ సినిమాతో చరణ్, డీజే దువ్వాడ జగన్నాథంతో బన్ని అయినా పైసా పెట్టిన ప్రతిఒక్కరి జేబుల్లో లాభాలు నింపుతారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube