ఎకడైనా అమ్మాయి శరీరమే కావాలి అంటున్న హీరోయిన్

రాఘవేంద్రరావు – తాప్సి వివాదం ఇప్పట్లో ఖతం అయ్యేలా లేదు.ఎక్కడికి వెళ్ళినా తాప్సీని ఈ టాపిక్ మీదే ప్రశ్నలు అడుగుతున్నారు.

 Every Industry Is Obsessed With Female’s Body – Says Tapsee-TeluguStop.com

తాప్సి కేవలం రాఘవేంద్రరావునే కాదు, దక్షిణాది ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానించిందనేది ప్రధాన ఆరోపణ.ఈమధ్యే రాఘవేంద్రరావుకి క్షమాపణలు చెప్పిన తాప్సి, కొత్తగా బాలివుడ్ తక్కువేమీ కాదని, ఎక్కడైనా సరే, కావాల్సింది అమ్మాయి యొక్క శరీరమే అని మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది.

“తెలుగులోనే కాదు, బాలివుడ్ పాటల్లో కూడా స్త్రీ శరీరాన్ని అదోలా చూపిస్తారు.అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి.

అవన్నీ ఇప్పుడు చెప్పాలా ? ఎక్కడైనా కావాల్సింది అమ్మాయి శరీరమే కదా.నేను రాఘవేంద్రరావుని అవమానించాను, దక్షిణాది సినిమాను అవమానించాను అని అంటున్నారు.నేను ఎదో ఉద్దేశం పెట్టుకొని ఇంకేదో అనలేదు.ఈరోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే కారణం ఆయనే.మరి నేను ఆయన్నే ఎందుకు అవమానిస్తాను.నాకు బాలివుడ్ లో మంచి పాత్రలు దొరికాయి.

ఇక్కడ అలాంటి వెరైటి గ్లామర్ అనుభావాలు నాకు లేవు.అలాగని ఈ ఇండస్ట్రీ మొత్తం కరెక్టుగా ఉందని చెప్పలేను.

దేన్నీ మీడియా అనవసరంగా పెద్ద గొడవలా చూపించింది.ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, దాని వలన లాభాలు కూడా ఉన్నాయి.

నేను చేదుగా మాట్లాడకపోయినా నన్ను తిట్టారు.నేను దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేను.

ఈ ఒక్క కారణంతో సోషల్ మీడియా నుంచి పారిపోను” అంటూ చెప్పింది తాప్సి.

చూస్తోంటే జరిగన డామేజ్ ని కవర్ చేసుకునేందుకు బాగా ప్రయత్నిస్తూ ఉన్నట్టుండి తాప్సి.

సోషల్ మీడియాలో తెలుగువారు తాప్సి అనరాని మాటలు అంటున్నారు, తాప్సి సినిమాలు చూసేది లేదు అంటున్నారు.ఏ గొడవ ఇప్పట్లో తెగేలా లేదు.

మరి ఈ వివాదం యొక్క ప్రభావం ఆగస్టులో వస్తున్న “ఆనందో బ్రహ్మ” సినిమాని ఏమేరకు ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube