Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఈ వింత సెక్స్ జబ్బు గురించి ఎప్పుడైనా విన్నారా ?-Ever Heard About A Sexual Disorder Sexsomnia ?

2005 సంవత్సరం బ్రిటన్ లో నిద్రపోతున్న ఈ మహిళపై ఓ పురుషుడు అత్యాచారానికి పాల్పడ్డాడు . కాని తాను పూర్తిగా మతిలో ఉండి చేసిన పని కాదు అది. అసలు తనకి ఓ మహిళపై బలవంతం చేసిన విషయం కూడా గుర్తుకు లేదు. మెడికల్ గా ఆ విషయం నిరూపితం అవటంతో చిన్న శిక్షతో తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇంకా చాలా దేశాల్లో ఇలాంటి కేసులు ఉన్నాయి.

అవన్నీ నాటకాలు, తెలియకుండా, గుర్తులేకుండా రేప్ ఎలా చేస్తారు. ఇది జరిగే పనేనా అని తిట్టుకోవద్దు .. పాపం .. ఇదో జబ్బు. నిద్రలో నడవటం ఎలాగో, నిద్రలో సెక్స్ చేయడం వీరి సమస్య. ఏమి గుర్తుకు ఉండదు, శృంగార క్రియలు కావాలని చేయరు. కేవలం పురుషులే కాదు, ఈ సమస్యతో స్త్రీలు కూడా బాధపడతారు. దీన్ని మెడికల్ భాషలో సేక్సోమ్నియా (Sexsomnia) అని అంటారు.

నిద్రలోనే స్వయంతృప్తి పొందే ప్రయత్నం చేయడం, నిద్రలోనే భావప్రాప్తి పొందటం, నిద్రలోనే మొనింగ్, కామోద్రేకంతో మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఒక్కోసారి నగ్నంగా బయటకి నడుచుకుంటూ వెళ్ళడం కూడా జరుగుతుందట. వీరి వింత సమస్య క్రూరంగా మారి అత్యాచారానికి పాల్పడుతారు. తెల్లారితే ఏమి గుర్తుండదు. స్ట్రెస్, నిద్రలేమి, హైపర్ సెక్సువల్ థాట్స్ వలన ఈ సమస్య రావచ్చు అని అంటున్నారు డాక్టర్లు.

వీరిని ఆపోజిట్ సెక్స్ లేదా సెక్స్ పార్టనర్ పక్కన పడుకోబెడితే, సమస్య ఇంకా ఎక్కువ అవుతుందట. ఈ సమస్యతో ఇబ్బందిపడేవారు మద్యం సేవిస్తే, అసలేం జరుగుతుందో కూడా ఊహించడం కష్టం అని చెబుతున్నారు పరిశోధకులు.

ఎక్కువగా మగవారే దీనితో ఇబ్బందిపడినా, అమ్మాయిలు కూడా నిద్రలో లైంగిక చర్యలు చేసి అభాసుపాలు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే, లైఫ్ స్టయిల్ పద్ధతులు మార్చుకోవడమే. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఎక్సేసివ్ సెక్స్ ఆలోచనలు లేకపోవడం, స్ట్రెస్ లేకపోవడం, మంచి లైంగిక సంబంధం కలిగి ఉండటం ఈ సమస్యకి పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు సేక్సాలాజిస్టులు. ఇలాంటి సమస్యకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే, దాచుకోవడానికి బదులు వెంటనే మానసిక నిపుణులని కలిస్తే మంచిది.

Continue Reading
More Posts
To Top