మహేష్ బాటలోనే పవన్ కూడా

ఇప్పుడు ఏ హీరో నోటా విన్నా, ద్విభాష చిత్రం అనే పదమే వినబడుతోంది.దీనికి ప్రధాన కారణం బాహుబలి.

 Even Pawan Kalyan Plans A Bilingual Now?-TeluguStop.com

ఈ సినిమా వస్తే కాని, వేరే భాషల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటొచ్చు అనే విషయం గుర్తుకురాలేదు మన సినిమా వాళ్ళకి.డబ్బింగ్ సినిమాని ఆదరించినప్పుడు, ద్విభాష చిత్రంపై కూడా ఆసక్తి చూపుతారు కదా.అందుకే అందరు ద్విభాష చిత్రాల మీద పడ్డారు

ఈ ట్రెండ్ ని మొదలుపెట్టింది మాత్రం మహేష్ బాబే.ఏఅర్ మురుగదాస్ దర్శకత్వంలో మన సూపర్ స్టార్ ఒక భారి ద్విభాష చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో మార్కేట్ సంపాదించుకోవాలని మురుగదాస్, తమిళంలో ఉన్న కొద్ది మార్కేట్ ని పెద్దగా చేసుకోవాలని మహేష్ బాబు ఈ పక్కా బైలింగ్వల్ సినిమా చేస్తున్నారు

ఇదే బాటలో అల్లు అర్జున్ లింగు స్వామి దర్శకత్వంలో తెలుగు – తమిళ ద్విభాష్ చిత్రం అన్నౌన్స్ చేసేసాడు.ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇలాంటి అలోచనలోనే ఉన్నట్లు, అందుకే తదుపరి చిత్రం ఇంకా ప్రకటించట్లేదని ఫిలింనగర్ టాక్

అదే ఫిలింనగర్ లో ఇప్పుడు మరో పుకారు వినిపిస్తోంది.

అదేంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ద్విభాష చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు, తమిళ మార్కేట్ కి హెల్ప్ అయ్యేలా అక్కడి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని ప్రాజెక్టులోకి లాగుతున్నట్లు ఒకటే గుసగుస.మరి ఇందులో నిజానిజాలేంటో ముందు ముందే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube