టీనేజ్ దాటాక కూడా మొటిమలు రావడానికి కారణాలు

దాదాపుగా ప్రతీ రెండొవ టీనేజర్ ని ఇబ్బందిపెట్టే సమస్య ఆక్నే (మొటిమలు).కొందరికి వీటి బెడద ఎక్కువ ఉంటుంది .

 Even After Teenage, Pimples May Occur For These Reasons-TeluguStop.com

అంతే తేడా ! అయితే మొటిమలు కేవలం టీనేజర్స్ కే వస్తాయి, ఆ తరువాత రావు అని అనుకుంటే అది మీ పొరపాటే.టీనేజ్ దాటిన తరువాత కూడా మొటిమలు రావొచ్చు.

దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

* 22-23 సంవత్సరాలు దాటినా, పింపుల్స్ రావడానికి అతిపెద్ద కారణం డిప్రేషన్.

ముభావంగా ఉండే ముఖం ఎప్పుడు అనారోగ్యానికే దారి తీస్తుంది.స్ట్రెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి, ఆయిల్ సీక్రేషన్ ఎక్కువైపోయి మొటిమలు ఏర్పడతాయి.

* ఒక్కసారిగా డైట్ మార్చడం వలన మొటిమలు వస్తాయి.మహానగరాల్లో ఉండే యువత తిండి ఎప్పుడు ఒకెలా ఉండదు.

రుచి కోసం కొత్తరకం వంటకాలన్నీ ప్రయత్నిస్తారు.అవి ఇంట్లో ప్రయత్నిస్తే వేరు విషయం, బయట ఫుడ్ కి అలవాటు పడితేనే కష్టం.

* కొన్నిరకాల స్కిన్ ప్రాడక్ట్స్ కూడా బ్రేక్ అవుట్స్ కి కారణమయ్యి, మొటిమల బెడద పెంచుతాయి.అందుకే బ్యూటి ప్రాడక్ట్స్ అయినా సరే, పరిజ్ఞానం ఉన్నవారిని సంప్రదించే వాడాలి.

* స్మార్ట్ ఫోన్స్ రోజంతా వాడతారు కాని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకునే అలవాటు ఎవరి దగ్గర కనబడదు.స్మార్ట్ ఫోన్స్ మోసుకొచ్చే బ్యాక్టీరియా కంటికి కనబడదు కాని చేయాల్సిన హాని చేస్తుంది.

* చేతులు ముఖం మీద పెట్టే అలవాటు ఉంటుంది కొందరికి.నిజానికి ఇది చెడ్డ అలవాటు.

ఎక్కడెక్కడో చేతులు పెట్టి, బ్యాక్టీరియా తగిలించుకొని, ముఖానికి మీరే రాసుకుంటారు.

* ఇక సీటిల్లో ఉండే పోలుషన్, గంటలకొద్దీ ప్రయాణాలు ఎలాగో బ్రేక్ అవుట్స్ కి కారణమవుతాయి.

ఇక జెనిటిక్ ప్రాబ్లం, హార్మోనల్ ప్రాబ్లంతో మొటిమలు వస్తే, అది మీ దురదృష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube