Connect with us

మీ మిత్రులకు షేర్ చేయగలరు.

Featured

టీనేజ్ దాటాక కూడా మొటిమలు రావడానికి కారణాలు-Even After Teenage, Pimples May Occur For These Reasons

దాదాపుగా ప్రతీ రెండొవ టీనేజర్ ని ఇబ్బందిపెట్టే సమస్య ఆక్నే (మొటిమలు). కొందరికి వీటి బెడద ఎక్కువ ఉంటుంది .. అంతే తేడా ! అయితే మొటిమలు కేవలం టీనేజర్స్ కే వస్తాయి, ఆ తరువాత రావు అని అనుకుంటే అది మీ పొరపాటే. టీనేజ్ దాటిన తరువాత కూడా మొటిమలు రావొచ్చు. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

* 22-23 సంవత్సరాలు దాటినా, పింపుల్స్ రావడానికి అతిపెద్ద కారణం డిప్రేషన్. ముభావంగా ఉండే ముఖం ఎప్పుడు అనారోగ్యానికే దారి తీస్తుంది. స్ట్రెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి, ఆయిల్ సీక్రేషన్ ఎక్కువైపోయి మొటిమలు ఏర్పడతాయి.

* ఒక్కసారిగా డైట్ మార్చడం వలన మొటిమలు వస్తాయి. మహానగరాల్లో ఉండే యువత తిండి ఎప్పుడు ఒకెలా ఉండదు. రుచి కోసం కొత్తరకం వంటకాలన్నీ ప్రయత్నిస్తారు. అవి ఇంట్లో ప్రయత్నిస్తే వేరు విషయం, బయట ఫుడ్ కి అలవాటు పడితేనే కష్టం.

* కొన్నిరకాల స్కిన్ ప్రాడక్ట్స్ కూడా బ్రేక్ అవుట్స్ కి కారణమయ్యి, మొటిమల బెడద పెంచుతాయి. అందుకే బ్యూటి ప్రాడక్ట్స్ అయినా సరే, పరిజ్ఞానం ఉన్నవారిని సంప్రదించే వాడాలి.

* స్మార్ట్ ఫోన్స్ రోజంతా వాడతారు కాని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకునే అలవాటు ఎవరి దగ్గర కనబడదు. స్మార్ట్ ఫోన్స్ మోసుకొచ్చే బ్యాక్టీరియా కంటికి కనబడదు కాని చేయాల్సిన హాని చేస్తుంది.

* చేతులు ముఖం మీద పెట్టే అలవాటు ఉంటుంది కొందరికి. నిజానికి ఇది చెడ్డ అలవాటు. ఎక్కడెక్కడో చేతులు పెట్టి, బ్యాక్టీరియా తగిలించుకొని, ముఖానికి మీరే రాసుకుంటారు.

* ఇక సీటిల్లో ఉండే పోలుషన్, గంటలకొద్దీ ప్రయాణాలు ఎలాగో బ్రేక్ అవుట్స్ కి కారణమవుతాయి. ఇక జెనిటిక్ ప్రాబ్లం, హార్మోనల్ ప్రాబ్లంతో మొటిమలు వస్తే, అది మీ దురదృష్టం.

Continue Reading

More in Featured

 • HEALTH TIPS

  Infections that can spread while kissing

  By

  ముద్దు పెట్టుకోవడం మంచిపనే. సంభోగానికి ముందు ప్రేరేపణకి పనికివస్తుంది. సెరోటోనిన్, ఆక్సిటోసిన్, డోపామైన్ లాంటి హార్మోన్లు విడుదల చేసి శరీరానికి, మనసుకి,...

 • HEALTH TIPS

  How to stop Sex dreams and night ejaculation

  By

  అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, సెక్స్ కలలు రావడం చాలా సహజమైన విషయం. దీంట్లో బాధపడాల్సిన అవసరం కాని, తప్పు అనుకోని తమని తాము...

 • HEALTH TIPS

  What a cool drink does in your body?

  By

  వస్తున్నది వేసవికాలం. భగభగలాడే భానుడి దెబ్బకి, రోజంతా దాహం వేస్తూనే ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి మంచి నీళ్ళు తాగితే మంచిది. కొబ్బరినీళ్ళు...

 • HEALTH TIPS

  Super foods for healthy and white teeth

  By

  చిరునవ్వు మనిషి అందాన్ని రెట్టంపు చేస్తుంది. కాని ఆ చిరునవ్వు అందంగా కనిపించాలంటే మాత్రం దంతాలు తెల్లగా ఉండాల్సిందే. సో, మన...

To Top
Loading..