ఫోన్లు పేలడం వలన శాంసంగ్ కి వచ్చే నష్టమెంతో తెలుసా?

మీరు వంద మంచి పనులు చేయండి, చేసిన ఒక్క చెడ్డ పనే జనాలకి బాగా గుర్తుండిపోతుంది.బిజినెస్ లోనూ అంతే, ఒక్క బ్యాడ్ ప్రాడక్ట్ కంపెనీ వాల్యూ కిందకి దింపేయగలదు.

 Estimated Loss For Samsung Company Will Blow Your Minds!-TeluguStop.com

ఇప్పుడు టాప్ టెక్నాలజీ బ్రాండ్ శాంసంగ్ విషయంలో అదే జరుగుతోంది.శాంసంగ్ నోట్ 7 మొబైల్స్ పేలుతూ ఉండటం ఆ కంపెనీ ఇమేజ్ ని బాగా దెబ్బతీసింది.
ఆ సంస్థ తాజాగా, జులై నుంచి సెప్టెంబరు మాసాలలో వచ్చిన లాభాలను వెల్లడించింది.షాకింగ్ గా, ఆపరేటింగ్ లాభాలు 30% తగ్గాయి.కేవలం 3056 కోట్ల లాభం మాత్రమే వచ్చిందట.ఇక నికర లాభం 17% కిందకి పడిపోయి 3.9 బిలియన్ డాలర్లుగా నిలిచింది

కేవలం మొబైల్స్ వరకే తీసుకుంటే గత ఏడాది శాంసంగ్ 2.4 ట్రిలియన్ల రెవెన్యూ శాంసంగ్ చేతికి అందితే, ఈ ఏడాది కేవలం 100 మిలియన్ల నిర్వహణ లాభాన్ని పొందిందట.నోట్ 7 వైఫల్యం మూలాన, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆరు నెలల్లో శాంసంగ్ నష్టపోతున్న డబ్బు ఎంతో తెలుసా? సుమారు 35,438 కోట్లు అంట.నోళ్ళు వెళ్లబెట్టేసారా !

ఇది శాంసంగ్ పతనానికి మొదలేమో! మనదేశంలో ఇప్పటికి అత్యధిక స్మార్ట్ ఫోన్స్ అమ్ముతున్న సంస్థ శాంసంగే.25% పైగా మార్కెట్ ని ఆక్రమించుకుంది శాంసంగ్.కాని షియోమి రెడ్మీ రాకతో శాంసంగ్ మార్కెట్ మన దేశంలో రాను రాను పడిపోతోంది.

ఇక వరల్డ్ వైడ్ గా నోట్ 7 ఫోన్లు పేలడం శాంసంగ్ ని మరచిపోలేని దెబ్బతీసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube