హార్ట్ ఎటాక్ కి అంగస్తంభనకి ఏంటి సంబంధం?

అంగస్తంభనలు తగ్గడానికి పలు కారణాలు ఉండవచ్చు.కాని మీకు మంచి భాగస్వామి దొరికి, శృంగారం పట్ల ఆసక్తి ఉండి, టెస్టోస్టిరోన్ లెవెల్స్ కూడా సరిగా ఉండి .

 Know How Erectile Dysfunction Can Also Cause Heart Attack-TeluguStop.com

అంగం స్తంభించట్లేదు అంటే అర్థం, బ్లడ్ సర్క్యులేషన్‌ సరిగా లేదని.రక్తం సరిగా చేరితేనే కదా అంగం గట్టిపడేది.

మరి రక్తం సరిగా చేరకపోతే? అంగం మాత్రమే కాదు, మీ గుండె కూడా ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించండి అంటున్నారు డాక్టర్లు.ఇంతకి గుండెకి, పురుషాంగానికి ఏంటి సంబంధం?

Atherosclerosis అనే కండీషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ సమస్య ఉంటే బ్లడ్ వెసెల్స్ సరిగా డైలెట్ కావు.దాంతో రక్తం సరిగా సరఫరా కాదు.కొలెస్టెరాల్ మీ బ్లడ్ వెసెల్స్ లో పేరుకుపోవడం వలన, బ్లడ్ ఫ్లోకి సరైన స్పేస్ దొరక్క, బ్లడ్ ఫ్లో మందగిస్తుంది.

ఇలా బ్లడ్ సర్క్యులేషన్‌ సరిగా లేక, పురుషాంగం దాకా త్వరగా చేరక, అంగం స్తంభించటం కష్టమైపోతుంది.ఇదే కండీషన్ కంటిన్యూ అయితే, మీకు గుండెజబ్బులు రావొచ్చు.గుండె పూర్తిగా ఆగిపోవచ్చు.కాబట్టి, అంగస్తంభన సరిగా లేకపోతే, దాన్ని కేవలం సెక్స్ ప్రాబ్లంలా చూడొద్దు.

ఎందుకు గట్టిపడటం లేదో మెడికల్ టెస్టుల ద్వారా తెలుసుకోండి.మానవ శరీరం అంతే, ఏ సమస్య ఎటువంటి చేదునిజాన్ని మోసుకొస్తుందో చెప్పడం కష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube