జనసేనలో చేరాలంటే ప్రవేశ పరీక్ష రాయాలంట

ప్రవేశ పరీక్షలు మనకు కొత్తేమి కాదు.ఇంజనీరింగ్ లో చేయాలనుకుంటే ఎంసెట్ రాస్తాం, ఎమ్బిఏ చేయాలనుకుంటే ఐసెట్ రాస్తాం .

 Entrance Test For People Willing To Join Janasena-TeluguStop.com

ఇలా చాలా కోర్సులకి చాలారకాల పరీక్షలు ఉన్నాయి.పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఫైనల్ ఇంటర్వ్యూకి ముందు రాత పరీక్ష పెడతారు.

కాని ఓ రాజకీయపార్టిలో చేరాలంటే పరీక్ష రాయాలనే తంతుని ఎక్కడైనా చూసారా ? ఈ కొత్త సిస్టం ని తీసుకొస్తున్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.జనసేనలో సభ్యత్వం కావాలంటే అర్థత కోసం ఓ రాతపరీక్ష రాయాల్సిందే అంట.

ఈ రాత పరీక్షలో ఏం రాయమంటారో, ఎలాంటి ప్రశ్నలు వదులుతారో తెలియదు కాని ఇప్పటికే 3600 దరఖాస్తులు వచ్చాయట.ఏప్రిల్ 21 నుంచే మొదలయ్యే ఈ అర్హత పరీక్షలు మూడురోజులపాటు కొనసాగుతాయి.

పరీక్ష వేదిక జీఆర్ గార్డెన్స్‌, గొంగ‌డి రామ‌ప్ప కాంపౌండ్‌, 3వ రోడ్డు ఎక్స్‌టెన్ష‌న్‌, ఈస్ట్ గేట్, అనంత‌పురం.ఎవరి పరీక్ష ఎప్పుడు, ఏ సమయంలో, ఏ రోజు ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్తులకి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

మరి ఇంకా ఆలస్యం ఎందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ? మీరు జనసేనలో ఓ భాగం కావాలనుకుంటే వెంటనే దరఖాస్తు పెట్టుకోండి.పరీక్షకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube