Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఇవి చదివి ఇంగ్లీషులో వాక్యాలు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి-English Tenses And Their Telugu Examples For Speaking Skills

ఏ భాష అయినా సరే, మాట్లాడాలంటే ముందుగా పద సంపద ఉండాలి. ఇంగ్లీషు మన దేశంలో హిందీతోపాటు ఒక అఫిషియల్ భాష కావడంతో మనకు ఇంగ్లీషు పదాలతో పరిచయం ఉంది. ఆ పదాల్ని ఒక వాక్యంలోకి ఎలా చేర్చాలి అనే చోటే సమస్య వస్తుంది. మాట్లాడే అలవాటు లేకపోవడం వలనే ఈ ఇబ్బంది అంతా. ఇక రెండో విషయం, మనం తెలుగు ఇంతబాగా మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం మనకు కాలక్రియలు తెలిసి ఉండటం. వీటినే ఇంగ్లీషులో Tenses అని అంటారు. ఉదాహారణగా చెప్పాలంటే .. రాము రేపు గ్రౌండ్ కి వెళ్ళి క్రికేట్ ఆడతాడని మనకు తెలుసు .. దాన్ని ఓ వాక్యంలో చెప్పాలంటే “రాము రేపు క్రికేట్ ఆడబోతున్నాడు” అని అంటాం అని “రాము రేపు క్రికేట్ ఆడేశాడు” అని చెప్పలేం కదా. ఇలాంటి తప్పులు తెలుగులో ఎందుకు చేయట్లేదు అంటే మనకు కాలక్రియలు తెలుసు కాబట్టి. వర్తమాన, భూత, భవిష్యత్తు కాలల మధ్య వ్యత్యాసం తెలుసు కాబట్టి, ఏ కాలంలో ఎలాంటి “క్రియ” ఉపయోగించాలో తెలుసు కాబట్టి. ఇవన్ని చదువుకోని వారు కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడటానికి కారణం, చిన్ననాటి నుంచి భాషని వింటూ, మాట్లాడే అలవాటు ఉండటం. అలాంటి వాతావరణం ఇంగ్లీషుకి లేకపోవడం వలనే చిక్కంతా. అయితే ఇంగ్లీషు మాట్లాడటం, రాయడం మీరు అనుకున్నంత కష్టమైన పనేం కాదు కదా. అందుకే ఇంగ్లీషులోని కాలక్రియలు (tenses) గురించి మీరు తెలుసుకోవాలి .. వివరంగా చెబుతున్నాం పూర్తిగా చదవండి.

* టెన్సెస్ రకాలు – టెన్సెస్ లో రకాలు

ఇంగ్లీషు కాలక్రియలు మూడు రకాలు. ఒకటి Present Tense (వర్తమాన కాలం), Past Tense (భూత కాలం), Future Tense (భవిష్యత్తు కాలం). ప్రతి టెన్స్ లో నాలుగు సబ్ టెన్స్ ఉంటాయి. అవే
Simple Tense
Continuous Tense
Perfect Tense
Perfect Continuous Tense.

ప్రతి సబ్ టెన్స్ లో నాలుగు రకాల వాక్యాలు ఉంటాయి. అవి

Declarative Sentences : స్టేట్మెంట్ ఇవ్వడం
Interrogative Sentences: ప్రశ్నించడం
Negative Sentences: నెగెటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం
Negative Interrogative Sentences: నెగెటివ్ గా ప్రశ్నించడం

ఇక ప్రతి వాక్యంలో ప్రథమ పురుష, ద్వితీయ పురుష, తృతియ పురుష ఉంటుంది. వాటిని బట్టి వాక్యంలో helping verbs మరియు క్రియ పలికే విధానం మారిపోతుంది. మరి వాటి ఊదాహరణలు ఇటు ఇంగ్లీషులో, అటు తెలుగులో చూద్దామా ? అప్పుడైతే మీకు ఎలాంటి సందర్భంలో ఎలాంటి వాక్యం వాడాలో అర్థం అవుతుంది.

Continue Reading
To Top