అమెరికాలోని భూమి జప్తు

అమెరికాలోని భూమి జప్తు (అటాచ్‌మెంట్) అయితే మనకేమిటి సంబంధం? దాన్ని గురించి ఎందుకు చెప్పుకోవాలి? అనే ప్రశ్నలు రావడం సహజం.అయితే ఆ భూమిని జప్తు చేసింది అమెరికా ప్రభుత్వం కాదు.

 Enforcement Directorate Attaches Land In Us In Loan Fraud Case-TeluguStop.com

మన ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).అదీ ఇక్కడ విశేషం.

విదేశాల్లోని భూమిని అటాచ్‌ చేయడం అసాధారణ చర్య.ఇలా చేయడం ఇదే మొదటిసారి.

కాలిఫోర్నియాలోని ఈ భూమి విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఉంది.మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకున్నారు.

జూమ్‌ డెవలపర్స్ ప్రయివేటెడ్‌ లిమిటెడ్‌ అనే సంస్థ, విజయ్‌చౌధురి అనే వ్యాపారి బ్యాంకును మోసం చేసిన కేసులో ఈడీ ఈ అసాధారణ చర్య తీసుకుంది.రుణాలు తీసుకొని బ్యాంకును మోసం చేసిన కేసుల్లో దేశంలో ఇది అతి పెద్దదని ఈడీ అధికారులు చెప్పారు.

అమెరికాలోని భూమిని కూడా అటాచ్‌ చేసిన మన ఈడీ అధికారుల సామర్థ్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.దేశంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కోటీశ్వరులు, బడా పెట్టుబడిదారులు అనేకమంది ఉన్నారు.

ప్రభుత్వం నల్లధనాన్ని ఎలా రప్పించలేకపోతున్నదో బ్యాంకులను మోసం చేసిన బడాబాబులను కూడా ఏం చేయలేకపోతున్నది.ఆర్థిక నేరాల్లో శిక్షలు పడి జైలుకెళుతున్నవారు చాలా తక్కువ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube