నెలకి ఇన్నిసార్లు హస్తప్రయోగం / శృంగారం చేస్తే పురుషులు ఆ వ్యాధికి దూరం

భావప్రాప్తి కేవలం సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాదు, శరీరానికి ఎన్నో లాభాల్ని ఇస్తుంది.కాలరీలు కరిగిస్తుంది.

 Ejaculating These Many Times Can Keep Prostate Cancer Away-TeluguStop.com

కొలెస్టరాల్ లెవల్స్ తగ్గిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.హాయి కలిగించే హార్మోన్స్ ని విడుదల చేసి మనిషిని ఒత్తిడి, స్ట్రెస్ కి దూరంగా సంతోషంగా ఉంచుతుంది.

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో లాభాలు ఉన్నాయి కాని శాస్త్రవేత్తలు తాజాగా మరో అద్భుతమైన లాభాన్ని కనిపెట్టారు.పురుషులలో స్కలనం వలన ప్రమాదకరమైన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని చెబుతున్నారు ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ వారు.

నెలకి కనీసం 21 ఒక్కసార్లు స్కలనాన్ని పొందే మగవారు నిజంగానే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ కి దూరంగా ఉంటారని చెబుతున్నారు రీసేర్చేర్స్.ఈ రీసెర్చ్ కోసం వారు 20-29 ఏళ్ల వయసున్న మగవారిని, 40-49 ఏళ్ళు ఉన్న మగవారిని తీసుకున్నారు.

అందులో కొందరు వారానికి మూడు నాలుగు సార్లు స్కలనాన్ని పొంది, నెలకి 12-16 సార్లు మాత్రమే స్కలనాన్ని చూసేవారైతే, మరికొంతమంది 21 సార్ల లెక్క దాటుతున్నవారు.వివిధ వయసులో ఉన్నవారిని, స్కలనం కౌంట్ మీద విభజించి పరీక్షలు నిర్వహించారు.

అందులో వారు ఊహించిన విషయమే బయటపడింది.స్కలనం ఎక్కువ సార్లు పొందుతున్నవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్కు చాలా తక్కువగా కనిపించింది.

ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, సకలనం ప్రోస్టేట్ గ్రంధిని కార్సినోజేనిక్ సబ్స్టెయిన్సేస్ మరియు ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది కాబట్టి.అందుకే స్కలనం కౌంట్ పెరిగినాకొద్ది, క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశాలు తగ్గుతాయి.

అయితే స్కలనం పొందడం అనేది ఒక మామూలు అలవాటుగానే ఉండాలి తప్ప, వ్యసనంలా మారకూడదని అంటున్నారు డాక్టర్లు.ఎక్కువ తీసుకుంటే ఔషధమైనా విషమే కదా.కాబట్టి దేనికైనా ఓ లిమిట్ ఉండాలి.అందుకే, స్కలనం పొందాల్సిన కౌంట్ ని సజెస్ట్ చేసారు డాక్టర్లు.

నెలకి 21 సార్లు స్కలనం పొందితే సరిపోతుందట.మరి అది హస్తప్రయోగం వలన పొందాలా లేదా శృంగారం ద్వారానా అనేది మీ చేతుల్లోనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube