గుండెపోటుని అడ్డుకునే ఈజీ విధానం

సమస్య పెద్దగా అయ్యాక, ప్రయత్నాలు మన తాహతుకి మించి చేయడం కన్నా, సమస్య మొదలవకుండా, చిన్ని చిన్ని మార్గాలతోనే పెద్ద పెద్ద సమస్యలను అడ్డుకుంటే బెటర్.అలాంటి ఓ పెద్ద సమస్యే గుండేపాటు.

 Egg Intake Will Reduce Chances Of Heart Stroke – Study-TeluguStop.com

దాన్ని అడ్డుకునే చిన్ని ఆయుధం గుడ్డు.అవును, కోడిగుడ్డు.

సగటున ఒక పెద్ద సైజ్ కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై క్వాలిటి ప్రొటీన్, రెండురకాల యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,డి,ఈ ఉంటాయి.ఇలా న్యూట్రింట్స్ సంపన్న ఆహారం కాబట్టే, రెగ్యులర్ గా ఉడకబెట్టిన గుడ్డుని తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం 12% తగ్గుతుందట.

ఈ విషయంపై అమెరికాలో ఓ ప్రోఫేసర్ డామినిక్ అలెగ్జాండర్ కొన్నేళ్ళుగా రిసెర్చి చేసారు.ఫలితాలు వెల్లడించిన ప్రొఫేసర్ ” గుడ్డులో యాంటిఆక్సిడెంట్ ప్రపార్టీస్ బాగా ఉండటం వలన ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇంఫ్లేమేషన్ ని అడ్డుకుంటాయి.

గుడ్లలో ప్రొటీన్ కూడా బాగా దొరకడంతో ఇవి బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ రిసెర్చి ఏదో చిన్నగా జరగలేదు లేండి.

మూడు లక్షలమందికి డైట్ లో గుడ్లని రోజూ అందిస్తూ, కొన్నేళ్ళపాటు పరీక్షలు చేశారు.ఆ తరువాత జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రీషన్, అమెరికన్ ఎగ్ బోర్డ్ ఈ ఫలితాలనయ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube